KIA CARS PLANT IN ANANTHAPUR : సకాలంలో వర్షాలు కురవక, పంటలు పండక కరవు కోరల్లో చిక్కుకున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో కియా ఇండియా పరిశ్రమ రాకతో రూపురేఖలు మారిపోయాయి. కార్లను ఉత్పత్తి చేస్తూ స్థానిక యువత ఎంతో మందికి ఉద్యోగాలను కల్పించి ఆసరాగా నిలుస్తుంది. జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో వినిపించేలా చేస్తోంది ఈ కియా ఇండియా పరిశ్రమ.
మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Popular Bikes In India
2017 వరకు పెనుకొండ మండలంలో ఎలాంటి అభివృద్ధి లేక రైతులు వలసలు వెళ్లే దుస్థితి ఉండేది. ఆ తర్వాత కియా పరిశ్రమకు అప్పటి టీడీపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదరడంతో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 600 ఎకరాల భూమిని సేకరించారు. నీటి సౌకర్యం కావాల్సిందిగా యాజమాన్యం కోరగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం 18నెలల్లోనే గొల్లపల్లి జలాశయ నిర్మాణ పనులు పూర్తి చేయించి, కృష్ణాజలాలతో నింపడంతో పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో కియా పరిశ్రమ ఏర్పాటైంది.
కార్ల తయారీలో 6,142 మంది ఉద్యోగులు: 2019 ఆగస్టులో కియా సెల్‌టాస్, 2020 ఫిబ్రవరి నుంచి కార్నివాల్, 2020 సెప్టెంబరు నుంచి సోనెట్, 2022 ఫిబ్రవరి నుంచి కారెన్స్, 2024 అక్టోబరు నుంచి న్యూ కార్నివాల్ మోడల్ కార్లు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. కార్ల తయారీలో 6,142 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని వారికి ఉపాధి దొరికింది. 2023 జులై 13 నాటికి కియా ఇండియా పరిశ్రమలో మిలియన్ కార్ల తయారీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
కార్లకు విడిభాగాలను యంత్రాలతో అమరుస్తున్న కార్మికులు: సీకేడీ(Completely Knocked Down) యూనిట్ల తయారీని జూన్ 2020లో ప్రారంభించగా ఇప్పటి వరకు లక్ష ఎగుమతి చేశారు. ఈ సీకేడీ యూనిట్లను ఆయా దేశాల్లోనే సమావేశమై సంస్థ ప్రతినిధులు వినియోగదారులకు అందిస్తారు.
''ఇంటర్ వరకు చదువుకున్నా కానీ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు వెళ్లలేకపోయా. ఉపాధి కోసం 2017లో బెంగళూరుకు వలస వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో నెలకు రూ.15వేలు జీతానికి పని చేసేవాడ్ని. అయితే నివాసం, భోజనానికే జీతంలో సగానికి పైగా ఖర్చయ్యేది. రెండేళ్ల కిందట కియా అనుబంధ పరిశ్రమలో చేరాను. ప్రస్తుతం రూ.18వేలు వేతనం వస్తోంది. ఇంటి వద్ద కుటుంబసభ్యులతో సంతోషంగా ఉన్నా'' - గోపాల్, బూచెర్ల, రొద్దం మండలం
''ఇంటర్ పూర్తి చేశా. రెండేళ్ల నుంచి కియా అనుబంధ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నా. నెలకు రూ.15వేలు వేతనం అందుతుంది. పరిశ్రమ బస్సులోనే వెళ్లి వస్తున్నా. సొంతూరులో తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉంటున్నా'' - వి.నాగార్జున, ఎం.కొత్తపల్లి, రొద్దం మండలం
కాలేజ్ స్టూడెంట్స్ స్పెషల్ - రూ.1.5 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!