ETV Bharat / state

'కఠిన నిర్ణయాలు తీసుకోవాలి' - సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ - PAWAN KALYAN MEET CM CHANDRABABU

ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిసిన పవన్‌ - వివిధ అంశాలపై సుమారు 2 గంటలపాటు ఇరువురి మధ్య చర్చ

Pawan_Kalyan_Meet_Chandrababu
Pawan Kalyan Meet Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 3:02 PM IST

Updated : Dec 2, 2024, 6:56 PM IST

Deputy CM Pawan Kalyan Meet CM Chandrababu: కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కోరారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ప్రమాదం తీసుకొచ్చేలా ఈ స్మగ్లింగ్‌ సాగిందని వివరించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో భోజన సమయంలో సుమారు రెండు గంటల పాటు పవన్‌ భేటీ అయ్యారు. కాకినాడ అడ్డాగా విదేశాలకు బియ్యం అక్రమ రవాణా అంశంపై ప్రధానంగా చర్చించారు.

కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని అరబిందో కోసం బెదిరించి 41.12 శాతం వాటా రాయించుకున్న అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే 48 వేల 537 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం ఎగుమతి కావడం బియ్యం మాఫియా విపరీతధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. రేషన్ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అధికారుల తీరు సరిగా లేదు: గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, తన పర్యటన సమయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఇప్పటికీ కొందరు అధికారుల తీరు సరిగా లేదని పేర్కొనట్లు సమాచారం. ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి కోట్లు కూడబెడుతున్నారని, రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులోనే గత ప్రభుత్వ హయాంలో బియ్యం ఎగుమతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలు బయటకు తీసుకురావాల్సి ఉందని పవన్‌ అభిప్రాయపడినట్లు సమాచారం.

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్​

రాజ్యసభ స్థానాలపై అభిప్రాయం వెల్లడి: ఖాళీ ఏర్పడిన మూడు రాజ్యసభ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపైనా పవన్‌ కల్యాణ్‌ తన అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అభ్యర్ధుల విషయంలో పలు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఎవరిని నిలబెడుతోందనేది ఇంకా అధికారికంగా కూటమి నేతలు ఎవరూ ప్రకటించలేదు. మూడు స్థానాల నుంచి ఒక్కో పార్టీ తరఫున ఒక్కొక్కరు పోటీలో ఉంటారా? రెండు చోట్ల టీడీపీ, ఒక చోట బీజేపీ అభ్యర్ధి నిలుస్తారా? అనేది ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

నామినేటెడ్‌ పదవుల భర్తీపై చర్చ: నాలుగో విడత నామినేటెడ్‌ పదవుల భర్తీ విషయంలో జనసేన తరఫున ప్రతిపాదిత పేర్ల గురించి పవన్‌ కల్యాణ్‌ చర్చించినట్లు తెలిసింది. సామాజిక మాద్యమాల వేదికగా జరుగుతోన్న వ్యక్తిత్వ హవనం, దుష్ప్రచారాల విషయంలో కొంత వరకు నియంత్రణ వస్తున్నా, ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని పవన్‌ సూచించినట్లు తెలిసింది. ఇటీవల చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చనిపోయినందున ముఖ్యమంత్రిని ఈ భేటీలో పరామర్శించినట్లు తెలిసింది.

'రెవెన్యూ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి - డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ'

ఎలాంటి ప్రకటన చేయకుండానే: రెండు గంటల భేటీలో ప్రధానంగా చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి పవన్‌ మీడియా వద్ద ఎలాంటి ప్రకటన చేయకుండా ఉండవల్లి సీఎం నివాసం నుంచి మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయానికి పవన్ వెనుదిరిగారు. ఇటీవల తన దిల్లీ పర్యటన అంశాలను పవన్‌ కల్యాణ్‌ వివరించినట్లు సమాచారం. ప్రధాని సహా కేంద్ర మంత్రులు ఎవరెవరితో భేటీ అయింది? రాష్ట్రానికి అందజేయాల్సిన సహాయం తదితర అంశాలపై జరిపిన చర్యల సారాంశాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.

అమరావతిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి అమరావతి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాకినాడ రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా చంద్రబాబు, పవన్​ల మధ్య చర్చకు వచ్చింది. త్వరలోనే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నందున, మంగళవారం జరిగే క్యాబినెట్​ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బెదిరించి అరబిందోకు వాటా రాయించుకున్నారు- తరువాతే రూ.45 వేల కోట్ల బియ్యం ఎగుమతి

Last Updated : Dec 2, 2024, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.