ETV Bharat / state

బాపట్లలో దారుణం- దంపతులను బలి తీసుకున్న రెస్టారెంట్ వ్యాపారం - Wife Husband Suicide in Bapatla - WIFE HUSBAND SUICIDE IN BAPATLA

Wife Husband Suicide in Bapatla District : ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. కానీ, అప్పులు పెరిగిపోయాయని, ఆస్తి దక్కలేదని, ప్రేమ, పగ, నిరాశ, అసంతృప్తి నేపథ్యంలో క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. బాపట్ల జిల్లా అప్పికట్లకు చెందిన దంపతులు బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా విషాదం నింపింది.

wife_husband_suicide_in_bapatla_district

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 4:39 PM IST

Updated : Apr 9, 2024, 4:51 PM IST

Wife Husband Suicide in Bapatla District : ఉగాది కొత్త సంవత్సరానికి నాంది. జీవితంలో ఎదురయ్యే సంఘటనల మేళవింపు. ఒడిదుడుకులన్నిటినీ సమంగా స్వీకరించి నిలబడమని చెప్పే నిదర్శనం. పిల్లా పాపలతో సంతోషంగా జరుపుకొనే షడ్రుచుల పండుగ. కానీ ఓ ఇంట్లో పండుగ వాతావరణం లేదు. ఉగాది రోజు ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు. బంధువులు (Relatives) కన్నీరు మున్నీరయ్యారు.

సుబ్బారావు కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: టీడీపీ - Subbarao Family Suicide Case

Couple Commit Suicide Due to Over Loss And Debt : అందరు పండుగ రోజు ఆనందంగా ఉంటే ఆ కుటుంబంలో మాత్రం విషాదఛాయలు నెలకొన్నాయి. బాపట్ల జిల్లా అప్పికట్లకు చెందిన ఎరువుల దుకాణ వ్యాపారి కోయ విష్ణు ప్రసాద్ (49) ఆర్థిక ఇబ్బందులతో భార్య మహాలక్ష్మి (39) తో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విష్ణు ప్రసాద్ బాపట్లలోని ఓ రెస్టారెంట్‌లో భాగస్వామిగా ఉండే వారు. వ్యాపారంలో నష్టం వచ్చి లక్షల్లో అప్పుల పాలయ్యారు. అప్పుల భారంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నామని విష్ణు ప్రసాద్ రాసిన లేఖ లభ్యమైందని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పత్తికొండలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యాలు - ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆత్మహత్యాయత్నం
Suicide in Andhra Pradesh : ఉదయం కూడా గ్రామంలో అందరితో నవ్వుతూ మాట్లాడిన మనిషి ఇక లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందు రోజు విష్ణు ప్రసాద్​ తన భార్యతో కలిసి బాపట్ల ఆసుపత్రికి వెళ్లి వచ్చినట్లు చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో వీరు మధ్యాహ్నం ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డట్లు నిర్దారించారు. ఎన్నిసార్లు ఫోను (Phone) చేస్తున్నా తీయకపోవడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో తమ బంధువు ఇంటి వద్దకు వచ్చి చూసింది. అప్పటికే వ్యాపారి దంపతులు విగత జీవులై పడి ఉన్నారు. బాపట్ల గ్రామీణ సీఐ శ్రీహరి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. బంధువులు స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం, కుటుంబ కలహాలతో భార్య సూసైడ్ - భర్తను కొట్టిచంపిన బంధువులు!

అప్పుల కోసం ఇంట్లో గొడవ- భార్యాపిల్లలను చంపేసిన పోస్ట్​మ్యాన్- ఆపై సూసైడ్!

Last Updated : Apr 9, 2024, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.