Wife who Killed her Husband : కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు భర్తకు తెలియడంతో కుమార్తె సాయంతో భార్య భర్తను హతమార్చింది. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో శనివారం జరిగింది. మృతుడి అక్క ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తల్లీకుమార్తెలపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీకి చెందిన కోటగిరి సునీల్ వంచనగిరి పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఉన్నారు.
దామెర మండలం ఊరుగొండకు చెందిన లక్ష్మిని సునీల్ వివాహం చేసుకున్నాడు. అయితే లక్ష్మికి గతంలోనే మరొకరితో వివాహం అయింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని, 12 ఏళ్ల క్రితం సునీల్‌ను లక్ష్మి రెండో వివాహం చేసుకుంది. లక్ష్మికి అప్పటికే ఓ కుమార్తె ఉంది. ఇప్పుడు ఆ బాలికకు 16 ఏళ్లు. సునీల్, లక్ష్మికి వివాహం అయిన తర్వాత కుమారుడు జన్మించాడు. ఇప్పుడు ఆ బాలుడికి ఆరేళ్లు.
తన కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు సునీల్‌కు రెండు రోజుల క్రితం తెలిసింది. ఈ విషయంపై భార్య, కుమార్తెను మందలించి కొట్టాడు. ఈ విషయం ఇంట్లో గొడవకు దారి తీసింది. దీంతో సునీల్ అక్క శుక్రవారం సునీల్ ఇంటికి వచ్చి భార్యాభర్తలిద్దరూ గొడవలు పెట్టుకోవద్దని దంపతులకు నచ్చజెప్పింది. శనివారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టుకుందామని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయింది.
భార్య, కుమార్తెలపై కేసు నమోదు : దీంతో శుక్రవారం రాత్రి భార్య, కుమార్తె కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సునీల్ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆయన కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన, శనివారం ఉదయం మృతి చెందాడు. భార్య, కుమార్తెలే సునీల్ చనిపోవడానికి కారణమని, ఇద్దరూ కలిసి తన తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని మృతుడి అక్క తెలిపింది. సునీల్ చనిపోవడానికి ముందు ఈ విషయాన్ని తనతో చెప్పాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్య, కుమార్తెలను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
'నన్నే అంత మాట అంటావా?' - అర్ధరాత్రి ఇంటికి పిలిపించుకుని మరీ హత్య
వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని మహిళ బ్లాక్ మెయిల్ - వేధింపులు భరించలేక హత్య