Eat Reveals Our Personality in Telugu : మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్లారా? ఒకవేళ వెళితే మీతోటి సీనియర్స్, నీ ప్రెండ్స్, పరిచయస్తులు మీకు ఒక మాట చెప్పే ఉంటారే. అదే ఒరేయ్ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్లినప్పుడు నువ్వు కూర్చునే విధానం, హావభావాలనూ వారు నిరంతరం గమనిస్తూనే ఉంటారు జాగ్రత్త రా బాబు. ఇంటర్వ్యూ చేసే వాళ్లు నీ మాటల్నే కాదు, ముఖ కవళికలను కూడా చూస్తారు. చూసుకో మరి. అంటూ హెచ్చరించి పంపుతారు. ఎందుకంటే ముఖ కవళికలు కూడా మన గురించి బోలెడన్ని విషయాలను చెప్పేస్తాయి మరి.
స్నేహితులతో ఉన్నప్పుడు కూడా మీ గురించి ఏమైనా అంటే వెంటనే మీ ముఖ కవళికలు మారిపోతాయి. ఠక్కున నీ స్నేహితుడు ఏరా, నీ ఫేస్ మారిపోయిందని అంటారు. నా భావాలు తనకు ఎలా తెలిసిపోయాయని అనుకుంటారు. ఒక్క ముఖ కవళికలు మాత్రమే కాదండోయ్, మీరు తినే తీరు సైతం మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుందనే విషయం మీకు తెలుసా? అదేలా అంటారా?
తినే తిండి విధానాల్లోనూ రకాలు : తినే విధానంలోనూ చాలా రకాలు ఉన్నాయట. ఒక్కో ముద్దనీ ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినడం, వేగంగా తినేయడం, అన్నం మధ్యలోనే ఉండాలనే వారు, ఇది తినను, అది తినను అని వంకలు పెట్టేవాళ్లు, ప్లేట్ చుట్టూ మెతుకులు పడేసేవాళ్లు, శబ్దం చేస్తూ తినేవాళ్లు ఇలా చాలా రకాలే ఉన్నాయట. ఇలా తినే రకాన్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని చెప్పొయొచ్చట.
తినే విధానం - వ్యక్తిత్వం :
- ఒక్కో ముద్దనీ ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినేవాళ్లు : మీరు పనినీ అలాగే నెమ్మదిగా చేస్తారనే భావన పక్కవారిలో కలుగుతుందట
- వేగంగా తినేవాళ్లు : వీరు మల్టీ టాస్కర్లు. చకచకా పని చేయడమే కాదు, గడువు కన్నా ముందు పని ముగిస్తారు. కాకపోతే పనిలో పడి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.
- అన్ని పట్టించుకుని తినేవాళ్లు : అన్నం మధ్యలోనే ఉండాలి. కూర రంగు మారకూడదు. ఇలా ప్రతీదీ పట్టించుకునేవారు అన్నీ ప్రణాళిక ప్రకారం సాగాలంటారు. ఇలాంటి వారు చుట్టుపక్కల ప్రదేశాన్నీ శుభ్రంగా ఉంచుకుంటారు.
- అన్ని కూరలను ఎంచేవాళ్లు : ఇది తినను, అది వద్దని వంకలు పెట్టేవాళ్లను రిస్క్ తీసుకోని వారిగానే పరిగణిస్తారు. వీళ్లెప్పుడూ ఓటమి భయంతో కొత్తవే ప్రయత్నించరట. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోతే విజయాలెలా సాధిస్తారని నిపుణులు వాదన.
- కంచం చుట్టూ మెతుకులు పడేలా తినేవాళ్లు : కొందరు ఇంకా చిన్నపిల్లల్లానే ఎంత పెద్ద ప్లేట్ అయినా సరే చుట్టూ మెతుకులు పడాల్సిందే అంటారు. అలాంటి వాళ్లు పక్కనుంటే సమయమే తెలియదట. పనినీ, చుట్టుపక్కల వాళ్లనీ ప్రేమిస్తారట. అయితే వీటన్నింటిలో పడి తుది గడువులు మర్చిపోవడమే వీరికున్న అతిపెద్ద సమస్య.
- శబ్దం చేస్తూ తినేవాళ్లు : భోజనం చేసేటప్పుడు శబ్దం చేస్తూ తినేవాళ్లదీ కంచం చుట్టూ మెతుకులు పడేసే వాళ్ల టైపే. కాకపోతే పక్కవాళ్లే కాస్త వీరిని ఇష్టపడరు. ఇక కొత్తవి ప్రయత్నించే వారు జీవితంలో సవాళ్లకు ఎదురెళతారంట. రిస్క్ తీసుకొని ఏదైనా సాధిస్తారంట.
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి- వైద్యులు ఏం సూచిస్తున్నారు? - How Many Eggs Are Healthy In A Day