Importance of Cultural Intelligence : పక్కఊరికి వెళ్తే అక్కడ మనకు కొంత కొత్తగా ఉంటుంది. అదే వేరే రాష్ట్రమో లేదంటే మరో దేశమో వెళ్తే పూర్తిగా కొత్త వాతావరణం ఎదురవుతుంది. అక్కడి సంస్కృతులను, ఆచారాలతో పాటు విభిన్నమైన వాతావరణాన్ని అర్థం చేసుకుని నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేసే వారికీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మనదగ్గర పనిచేస్తున్న వారికీ కల్చరల్ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యం. కార్పొరేట్ పని ప్రదేశాల్లో ఇది ఇప్పుడు ఎక్కవగా వినిపిస్తున్న బజ్‌వర్డ్. దీని గురించి మరిన్ని వివరాలతో ఈటీవీ భారత్ ఈ కథనం.
అత్యున్నత స్థాయి సంస్థలను ఇతర కంపెనీల కంటే విభిన్నంగా ఉంచేవి ఏమిటి? వారి ఉత్పత్తులు, మార్కెట్ వ్యూహాలు, ఆవిష్కరణలతో పాటు ఆ సంస్థ వర్క్ కల్చర్ సైతం వీటిలో ప్రముఖంగా కనిపిస్తుంది. దాన్ని ప్రభావితం చేయగలిగేది అందుకే కల్చరల్ ఇంటెలిజెన్స్‌కు కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి.
- బహుశా ప్రపంచీకరణ తర్వాత విభిన్న సంస్కృతులను చూడటం మనకు ఇలా ఇంతకు ముందెన్నడూ అవసరం అయిన సందర్భాలు లేవు. కానీ కనెక్టివిటీ అనేది మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతూ వస్తుండటం, బిజినెస్ తీరు మారిపోవడంతో ఇప్పుడు దీన్ని తప్పక అమలు చేయాల్సిన అంశంగా మారింది.
- నిజానికి ఇది ఒక క్లిష్టమైన స్కిల్, అయినా కూడా సాధన చేస్తే సంపాదించుకోవచ్చు. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన దీన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటో చూద్దాం.
సంస్కృతి : ఒక వ్యక్తి ప్రవర్తన, నైపుణ్యాలను వారు పెరిగిన సంస్కృతి, నేపథ్యం, వాతావరణం ఎంతగా ప్రభావితం చేయగలదో అర్థం చేసుకోగలగాలి. వాళ్లు పాటించే విలువలు, నమ్మకాలు దాదాపు అన్నింటికీ కారణాలు ఇక్కడి నుంచే ఉంటాయి. అందువల్ల దీనిని విస్మరించరాదు.
అర్థం చేసుకుంటూ : విభిన్న రకాల మనుషులతో కలిసి పనిచేస్తున్నప్పుడు, వారు ఉన్న టీంలో మనమూ ఉండాల్సి వచ్చినప్పుడు, పరస్పరం గౌరవించుకుంటూ, సహాయం చేసుకుంటూ ముందుకు సాగడం తప్పనిసరి. దీనికి అర్థం చేసుకోవడమే ప్రధాన సాధనం.
కల్చరల్ ఇంటెలిజెన్స్ ఎవరికి, ఎందుకు ఉండాలి? అందులో కొన్ని పరిశీలిస్తే..
వ్యక్తులు : పనిప్రదేశంలో ఫలప్రదమైన సంభాషణను కొనసాగించేందుకు అనుబంధాలు కలిగి ఉండేందుకు, ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఎవరితో అయినా కలిసి పనిచేయడానికి వ్యక్తులకు ఈ నైపుణ్యం అవసరం అవుతుంది. ఇది ఉత్పాతకత పెంచడంలోనే కాదు, వ్యక్తిగత పనితీరును మెరుగుపరుచుకోవడంలోనూ ఉపయోగపడుతుంది.
సంస్థలు : వైరుధ్యాలతో కూడిన ఉన్నతంగా ఉండేందుకు పని ప్రదేశాలను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునే విధానాలు రచించేందుకు, నూతన ఆలోచనల కోసం సంస్థలకు ఈ నైపుణ్యం కావాల్సిందే.
బృందాలు : ఒకే చోట అనేక మంది వ్యక్తులు కలిసి పనిచేస్తున్నప్పుడు అనుకోని సమస్యలు తలెత్తడం ఎక్కడైనా సహజం. ఇవి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లడానికీ, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికీ టీంకు కల్చరల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం.
పెంచుకోవడం ఎలా?
- ఈ ప్రపంచం అనేక విభిన్న సంస్కృతుల సమాహారం. అయినప్పటికీ అంతా కలిస్తేనే వినియోగముంటుంది. అందుకే కొత్త కల్చర్స్ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆక్సెప్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. తద్వారా ప్రశాంతమైన పని ప్రదేశంగా ఉండేందుకు సహకరించాలి.
- అలాగే సమస్యలు ఎదురైనప్పుడు, సవాళ్లు ఉన్నప్పుడు విశాల దృక్పథంతో ఆలోచించాలి. ఎదుటివ్యక్తి ఆలోచనలు, వాటికి కారణాలు తెలుసుకొని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
- కల్చరల్ ఇంటెలిజెన్స్ అధికంగా కలిగిన వ్యక్తులు విభిన్న పరిసరాల నుంచి వచ్చిన వారి నమ్మకాలు, విలువలు, పద్ధతులను చాలా సులభంగా ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది నిజానికి ఇతర నైపుణ్యాల మాదిరిగా ఒక స్కోరుతో నిర్ణయించగలిగేది కాదు. ఒక విధానంగా నేర్చుకుని చేయవలసినది. నిరంతరం దీనిపై దృష్టి పెడుతూ ముందుకు వెళ్లాలి.
'సోషల్ మీడియాలో ఆ కల్చర్ ఉంటుంది - వాటిని నేను పట్టించుకోను' - Janhvi Kapoor Trolls