ETV Bharat / state

వేరే రాష్ట్రాల్లో డీఈడీ చేద్దామనుకుంటున్నారా? - అయితే ఇవి తప్పక తెలుసుకోండి

వేరే రాష్ట్రాల్లో డీఈడీ చేయడానికి సందేహపడుతున్నారా? - విద్యార్థులు ఏ రాష్ట్రానికి చెందినవారైనా మరో రాష్ట్రం నుంచి చదవొచ్చట

Education In Other States
D.ED Education In Other States (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

D.ED Education In Other States : తెలంగాణ విద్యార్థులు ఏపీలో డీఈడీ చేయడానికి సందేహపడుతున్నారు. ఈ సర్టిఫికెట్‌ తెలంగాణలో ఈ ఏడాది నుంచి చెల్లుబాటు కాదని కొందరు విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీసీ, బీఎస్సీ, బీఈడీ అర్హతతో ఏ రాష్ట్రంలోనైనా చెల్లుబాటయ్యే కోర్సులేవి? వాటి గురించి తెలుసుకుందాం.

వేరే రాష్ట్రంలో డీఈడీ : విద్యార్థులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా మరో రాష్ట్రం నుంచి డిగ్రీ కానీ, డిప్లొమా కానీ చదవడంలో ఎలాంటి ఇబ్బందీ లేదని కెరియర్‌ కౌన్సెలర్‌ ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి పొందిన డిగ్రీ, డిప్లొమాల చెల్లుబాటు గురించి ప్రస్తావన లేదన్నారు. యూజీసీ గుర్తింపు ఉన్న అన్ని డిగ్రీలు, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి చేసిన బీఈడీ/ డీఈడీ దేశవ్యాప్తంగా చెల్లుతాయని తెలిపారు.

షిల్లాంగ్‌, మైసూరు, భువనేశ్వర్, అజ్మీర్​లో, భోపాల్ ఉన్న రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లలో, దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో వివిధ రాష్ట్రాల విద్యార్థులు బీఈడీ శిక్షణ పొందుతున్నారన్నారు. వీరిలో చాలామంది శిక్షణ అనంతరం సొంత రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని, ఎంపికవుతున్నారన్నారు. కాబట్టి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో డీఈడీ చేయడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఒక రాష్ట్రానికి చెందినవారు మరో రాష్ట్ర యూనివర్సిటీ/ విద్యా సంస్థ నుంచి డిగ్రీ/ డిప్లొమా పొందితే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉదాహరణకు ఏదైనా యూనివర్సిటీ, అది ఉన్న రాష్ట్రంలో కాకుండా, మరో రాష్ట్రపు అనధికార స్టడీ సెంటర్ల నుంచి యూజీసీ అనుమతి లేకుండా దూరవిద్య పద్దతిలో డిగ్రీలు జారీ చేస్తే ఆ డిగ్రీలు చెల్లవని పేర్కొన్నారు.

డిగ్రీలూ, డిప్లొమాలు : కొన్ని ప్రైవేటు/డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీలు యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాల్లో స్థాపించిన ఆఫ్‌ క్యాంపస్‌ల నుంచి డిగ్రీలు జారీ చేసిన సందర్భాల్లో మాత్రమే ఆ డిగ్రీ సర్టిఫికెట్లు చెల్లకపోవచ్చని తెలిపారు. ఎంపీసీ, బీఎస్సీ, బీఈడీ అర్హతలతో యూజీసీ, ఎన్‌సీటీఈ, రీహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఏఐసీటీఈ, బార్‌ కౌన్సిల్‌ లాంటి ప్రభుత్వ సంస్థల గుర్తింపు ఉన్న విద్యా సంస్థలు అందిస్తున్న ప్రోగ్రాంలలో మీకు నచ్చిన ప్రోగ్రాం ఎంచుకోవచ్చన్నారు. అలా పొందిన డిగ్రీలూ, డిప్లొమాలూ ఇతర రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, విదేశాల్లో కూడా చెల్లుతాయని క్లారిటీ ఇచ్చారు.

బీఏ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? - మీ కోసం బోలెడన్ని జాబ్ ఆఫర్స్! చెక్ చేసుకోండి

ఇంటర్ పాసైతే ఏడాదికి రూ. 1.5 లక్షల స్కాలర్‌షిప్- ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? - kotak kanya scholarship 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.