ETV Bharat / offbeat

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "పెసరపప్పు సున్నుండలు" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్భుతం!

నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే అద్దిరిపోయే లడ్డూ రెసిపీ - ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

HOW TO MAKE PESARA SUNNUNDALU
Pesara Pappu Sunnundalu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Pesara Pappu Sunnundalu Recipe in Telugu : చాలా మంది ఇష్టపడే స్వీట్ రెసిపీలలో ఒకటి సున్నుండలు. అయితే, వీటిని మీరు ఇప్పటి వరకు రకరకాలుగా ప్రిపేర్ చేసుకొని ఉండొచ్చు. కానీ, ఓసారి ఇలా పెసరపప్పుతో సున్నుండలను తయారు చేసుకొని చూడండి. చాలా తక్కువ అంటే తక్కువ పదార్థాలతో ప్రిపేర్ చేసుకునే ఈ లడ్డూలు సూపర్ టేస్టీగా ఉంటాయి. పైగా వీటిని చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు! ముఖ్యంగా పండగల సమయంలో ఫాస్ట్​గా ఏదైనా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది! మరి, ఈ లడ్డూల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పంచదార - 2 కప్పులు
  • పెసరపప్పు - 3 కప్పులు
  • నెయ్యి - 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు
  • యాలకుల పొడి - కొద్దిగా
  • జీడిపప్పు పలుకులు - కొన్ని

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన జీడిపప్పు పలుకులను నెయ్యిలో వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పంచదార వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని పెసరపప్పును వేసుకొని అది కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అనంతరం స్టౌ ఆఫ్ చేసి పెసరపప్పును కాసేపు చల్లార్చుకోవాలి.
  • ఆలోపు స్టౌపై కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్​లో ఉంచి అది కరిగే వరకు వేడిచేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి నెయ్యి గోరువెచ్చగా మారే వరకు చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న పెసరపప్పును వేసుకొని మెత్తని పౌడర్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పౌడర్, చక్కెర పొడిని వేసుకొని రెండు కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవిధంగా మిక్స్ చేసుకునేటప్పుడే అందులో కొద్దిగా యాలకుల పొడినీ వేసుకొని కలుపుకోవాలి.
  • అయితే, ఇక్కడ మీరు పంచదార వద్దనుకుంటే రెసిపీలోకి కావాల్సినంత బెల్లాన్ని తీసుకొని దాన్ని పొడిలా చేసుకొని చక్కెర ప్లేస్​లో వాడుకోవచ్చు.
  • తర్వాత ఆ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకొని ముందుగా ఒక భాగం పిండిలో సరిపడా కాచి చల్లార్చుకున్న గోరువెచ్చని నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి.
  • ఆపై చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్దికొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి.
  • ఆవిధంగా చుట్టుకున్నాక ఒక్కో లడ్డూకి ఒక్కొక్క వేయించుకున్న జీడిపప్పు పలుకును పైన యాడ్ చేసుకుంటూ మరోసారి లడ్డూను చక్కగా చేతితో చుట్టుకోవాలి. అలా పిండిని మొత్తాన్ని లడ్డూల్లా చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పెసరపప్పు సున్నుండలు" రెడీ!

ఇవీ చదవండి :

పోషకాలు దండిగా ఉండే "బీట్​రూట్ రవ్వ లడ్డు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

"మోతిచూర్​ లడ్డూ" - ఈ టెక్నిక్​ తెలిస్తే బూందీ గరిటెతో పనేలేదు - టేస్ట్​లో నో కాంప్రమైజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.