Heavy Rains In Telangana : ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. నేడు అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు తెలిపింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచించారు.
Massive Rains In Nirmal : నిర్మల్ జిల్లా కేంద్రంలో అరగంట కురిసిన వర్షం అల్లకల్లోలం సృష్టించింది. ఒక్కసారిగా కమ్ముకున్న మబ్బులతో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ప్రజలు రోడ్లపై వాహనాలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివాజీ చౌక్‌లో కిలోమీటర్ పొడవున వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు స్పందించి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చేస్తున్నారు.
Heavy Rains In karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఎండ వేడిమికి ఉపశమనం లభించింది. ఎండల ధాటికి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, ధర్మపురి, చిగురు మామిడి, బోయినపల్లి తదితర మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ విద్యుత్ సరఫరాకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. రెండు గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం : మరోవైపు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొంతకాలం నుంచి వర్షాలు లేక ఎండు ముఖం పట్టిన పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్లయింది. వర్షం పడడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి - Heavy Rains in Hyderabad
అమ్మా నా యూనిఫామ్ తడిసిపోతుంది - ప్లీజ్ నన్నెత్తుకోవా? - Hyderabad Rains Today