Irrigation Minister Reviews on Polavaram : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై, ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కమిషనర్ రామసుందర్‌రెడ్డి, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. పోలవరం పనుల తీరుపై మంత్రి అధికారులతో కలిసి ఈ సమావేశంలో చర్చించారు.
మరోసారి పోలవరం ప్రధాన డ్యాం అంచనాలు పెంపు - ఎన్ని వేల కోట్లంటే ?
డిసెంబరులో పోలవరంలో పర్యటించనున్న సీఎం: డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటిస్తారని రామానాయుడు అధికారులకు తెలియజేశారు. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల షెడ్యూలుపై మంత్రి వారితో సమీక్షించారు. పోలవరం కుడికాలువను అనుసంధానించే సొరంగాలు, మిగులు పనులు, లెప్ట్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా ఓ వెబ్సైటును ప్రారంభించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలియచేయాలని ఆయన ఆదేశించారు.
ప్రాధాన్య ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: హంద్రీ-నీవా, వెలిగొండ, చింతలపూడి తదితర ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ఆర్దిక ఇబ్బందులను అధిగమించి పూర్తి చెయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సాగు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8 వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. సాగు నీటి సంఘాల ద్వారా కాలువలు, డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనులలో రైతుల భాగస్వామ్యం ప్రాతినిధ్యం ఉండాలని మంత్రి ఆదేశించారు.
"2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం" - 8 బిల్లులకు మండలి ఆమోదం