ETV Bharat / state

వాటర్ హీటర్ వాడుతున్నారా? షాక్ కొట్ట‌కూడ‌దంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

వేడి నీటి కోసం హీటర్​ను వాడుతున్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉంటాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

PRECAUTIONS FOR USING WATER HEATER
Water Heater Precautions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 5:16 PM IST

Water Heater Precautions : నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుత్తు ప్రమాదాల కారణంగా మరణిస్తూనే ఉన్నారు. ఇంట్లో వాడే కరెంటు పరికరాలపై అవగాహన లేక విద్యాదాఘాతానికి గురవుతున్నారు. వేడి నీటి కోసం హీటర్​ను వాడుతుంటారు. వీటిని కొనేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, వినియోగంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యుదాఘాతానికి గురవుతున్నారు.

చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. గతంలో వేడి నీళ్లతో స్నానం చేయాలంటే కట్టెల పొయ్యి మీద వేడి చేసుకొని చేసే వాళ్లం. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి రావడంతో కట్టెల పొయ్యి కనిపించకుండా పోయాయి. ఈ రోజుల్లో చాలా మంది నీటిని వేడి చేసేందుకు వాటర్‌ హీటర్లు ఉపయోగిస్తుంటారు.

వీటిని కొనేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, వినియోగంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యుదాఘాతానికి గురవుతున్నారు. వీటిని వినియోగించేటప్పుడు విద్యుత్తు ప్రసారం జరిగే ఇనుము బకెట్లో కాకుండా ప్లాస్టిక్‌ బకెట్‌లో నీటిని వేడిచేయాలి. హీటర్‌ను వినియోగించేటప్పుడు నీటిలోకి ఎంత మేర ఉంచాలో దానిపై గుర్తు ఉంటుంది. బకెట్‌లో హీటర్ ఉంచే సమయంలో కర్రను వాడాలి. నాణ్యత లేని హీటర్లను ఉపయోగించవద్దు. వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. పాత వాటర్‌ హీటర్‌ రాడ్లను ఉపయోగించొద్దు. హీటర్‌కు లవణాలు పట్టుకొని ఉంటాయి. వారానికోసారి హీటర్​ను శుభ్రం చేస్తే త్వరగా నీరు వేడవుతుంది. ఎక్కువ సేపు నీటిలో హీటర్​ను ఉంచవద్దు.

హీటర్​ వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • హీటర్​లో నీటిని వేడి చేసిన తర్వాత ప్లగ్‌ నుంచి తీసివేయాలి. అలానే ఉంచితే మరిచిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల హీటర్ వేడెక్కి మంటలు లేచే ప్రమాదం ఉంది.
  • స్విచ్‌ ఆన్‌ చేసినప్పుడు నీటిని తాకొద్దు. షాక్ కొట్టే అవకాశం ఉంది. బటన్ ఆఫ్‌ చేసిన 10 సెకన్ల తర్వాత వాటర్‌ హీటర్‌ బయటకు తీసి చూడాలి.
  • పిల్లలు ఉన్నచోట, చేతికి అందే ప్రాంతంలో హీటర్‌ పెట్టవద్దు. విద్యుదాఘాతం జరిగే ఆస్కారం ఉంటుంది. స్నానపు గదుల్లో ఏర్పాటు చేసుకోవద్దు.
  • హీటర్‌ పెట్టిన తర్వాత వేడి ఉన్నంత సేపు దానిని ప్లాస్టిక్‌ బకెట్‌కు దూరంగా ఉంచాలి. వేడికి ప్లాస్టిక్‌ కరిగిపోతోంది. హీటర్లను గంటల తరబడి పెట్టవద్దు.
  • హీటర్‌ రాడ్‌ను నీళ్లలో మునిగేలా చూసుకోవాలి. స్విచ్‌ ఆఫ్‌ చేసిన తర్వాత, ప్లగ్‌ను తీసిన తర్వాతే నీళ్లను తాకి వేడిని పరిశీలించాలి.
  • ఐఎస్‌ఐ మార్కు ఉన్న హీటర్లను కొనుగోలు చేయాలి. 1500-200 వాట్స్‌తో పాటు ఓల్టేజీ 230-250 మధ్య ఉండే హీటర్లను కొనాలి.

బిగ్ అలర్ట్ : హీటర్ వాటర్​తో స్నానం చేస్తున్నారా? - ఈ విషయాలు తెలిస్తే షాకే! - Are You Bathing With Heater Water

కరెంట్ కష్టాలు : ఆ కాలనీలో 300 ఇళ్లకు ఒక్కటే మీటర్- మరి బిల్లు ఎంతో తెలుసా? - Lack of electricity distribution

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.