ETV Bharat / state

సృష్టిలో అద్భుతం - కింది నుంచి పైకి ప్రవహిస్తున్న నీరు, శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యారు! - Water Flows In Reverse Direction - WATER FLOWS IN REVERSE DIRECTION

Water Flows In Reverse Direction : ఈ భూమిపై ఎక్కడైనా నీరు పైనుంచి దిగువకు ప్రవహించడం చూస్తుంటాం. కానీ ఓ గ్రామంలో మాత్రం దీనికి భిన్నంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఈ వింతను చూసేందుకు ప్రజలు విశేషంగా తరలివస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం. ఆ విశేషాలేంటో? ఎక్కడ ఉందో? తెలుసుకుందాం రండి.

Water_Flows_In_Reverse_Direction
Water_Flows_In_Reverse_Direction
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 10:25 PM IST

Updated : Apr 20, 2024, 10:54 PM IST

సృష్టిలో అద్భుతం - కింది నుంచి పైకి ప్రవహిస్తున్న నీరు, శాస్త్రవేత్తలు సైతం అవాక్కయ్యారు

Water Flows In Reverse Direction : సాధారణంగా నీరు పైనుంచి కిందకు ప్రవహించడం ప్రకృతి ధర్మం. అయితే ఓ గ్రామంలో మాత్రం నీరు కాలువల రూపంలో ఎత్తైన ప్రదేశాలకు ప్రవహిస్తోంది. దీంతో ఈ ఘటన ఆ ప్రాంత వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వింతను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు తరలివస్తున్నారు. దీనిని స్థానికులు 'మినీ కశ్మీర్​గా' పిలుచుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వనం నుంచి మైదానం వరకు.. అంతర్జాతీయ అంధుల క్రికెట్​లో యువతి సత్తా

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని అంబికాపూర్ జిల్లాలో మెయిన్​పాట్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో బండరాయి కింది నీరు వస్తూ రెండు కిలోమీటర్ల ఎత్తైన ప్రదేశంలోకి ప్రవహిస్తుంది. అలా చివరకు ఓ వాటర్ ​ఫాల్​లో కలుస్తోంది. ఎక్కడైనా నీరు ఎగువ నుంచి దిగువకు ప్రవహిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం రివర్స్​లో ప్రవహిస్తుండటంతో చూపరులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోయారు : ఈ విధంగా నీరు కింది నుంచి పైకి ఎందుకు ప్రవహిస్తోందో శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోయారు. భూమికి ఉన్న గ్రావిటీ వల్లే ఈ విధంగా జరుగుతుందని కొందరు అంటున్నారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే కానీ, కారణం బయటపడేలా లేదు. ఈ వింత ఘటన గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ఇతర ప్రాంతాల వారు కూడా ఈ విచిత్రాన్ని చూసేందుకు మెయిన్​పాట్ గ్రామానికి తరలివస్తున్నారు. ఈ వింత ఘటనను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అక్కడి అద్భుత దృశ్యాలు అందరినీ కనువిందు చేస్తున్నాయి.

Mini Kashmir in Chhattisgarh : ఈ ప్రాంతాన్ని ఛత్తీస్​గఢ్ వాసులు 'మినీ కశ్మీర్​గా' పిలుచుకుంటున్నారు. నీరు ఎగువకు ప్రవహిస్తున్న ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల ఇక్కడ చలి అధికంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నీరు ఎత్తైన ప్రాంతాలకు ప్రవహించడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, దీనిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు చెబుతున్నారు. నిజంగా మనం ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ ప్రపంచమే ఒక దృగ్విషయం. ఇందులో ప్రతిదీ అద్భతమే. ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.

అరెకపూడి సిస్టర్స్.. 16 ఏళ్లకే.. అమెరికాలో విభిన్న రంగాల్లో సంచలనాలు..

సైకిల్ తొక్కండి.. ఫిట్​నెస్ పొందండి! సైకిల్​పై దేశాన్ని చుట్టేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడు

Last Updated : Apr 20, 2024, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.