ETV Bharat / state

ఫైనాన్స్‌ వాహనాలే ఆ ముఠా టార్గెట్ - కుదిరితే అగ్రిమెంట్ లేదంటే చోరీ - Vehicles Smuggling Scam in Warangal - VEHICLES SMUGGLING SCAM IN WARANGAL

Heavy Vehicles Smuggling Scam in Warangal : ఫైనాన్స్ కిస్తీ డబ్బులు కట్టలేని భారీ వాహనాలను తామే కొంటామంటూ ఆ ముఠా ప్రకటన ఇస్తుంది. ఇది నిజమేనని నమ్మిన వ్యక్తులు వారిని సంప్రదిస్తారు. ఇక్కడే ఆ గ్యాంగ్ తమ ప్లాన్‌ను అమలు చేస్తోంది. తొలుత బాధితులకు కొంత నగదు ఇచ్చి, మిగతాది తర్వాత ఇస్తామని అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాహనంతో ఉడాయిస్తారు. అనంతరం దానిని తుక్కు కింద్ర విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును వరంగల్ జిల్లా పోలీసులు రట్టు చేశారు.

Heavy Vehicles Smuggling Scam in Warangal
Heavy Vehicles Smuggling Scam in Warangal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 12:20 PM IST

Heavy Vehicles Smuggling Gang Arrested in Warangal : తెలుగు రాష్ట్రాల్లో భారీ వాహనాలను చోరీ చేసి తుక్కు కింద విక్రయిచడంతో పాటు విదేశాలకు తరలిస్తున్న దోపిడీ ముఠాను వరంగల్‌ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ బారీ వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తుర్కలకుంట గ్రామానికి చెందిన వరి కుప్పల దశరథ్‌(ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని తుర్కయంజాల్‌లో నివాసం), మేడ్చల్‌ జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన కౌశెట్టి రాకేశ్, పెద్దపల్లి జిల్లా వసంత్‌నగర్‌కు చెందిన దుర్గం సందాన్, హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన మహ్మద్‌ జబ్బార్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు.

Vehicle Theft Gang Arrest Warangal : నిందితుడు దశరథ్‌ జిల్లాలు, రాష్ట్రాలవారీగా వాట్సప్‌ గ్రూపులు తయారు చేశాడు. ఫైనాన్స్‌ కిస్తీ డబ్బులు కట్టలేని ఎక్స్‌కవేటర్లు, కార్లు, లారీలు, క్రేన్లు తదితర భారీ వాహనాలను కొంటామంటూ వాటిలో ప్రకటనలు ఇచ్చేవాడు. అలాంటివారు అతడిని సంప్రదించేవారు. వారిని ముఠా సభ్యులు స్వయంగా కలిసి మొదట కొంత డబ్బు ఇచ్చేవారు. వాహనాల కొనుగోలు పత్రం రాసుకునేవారు. వాహనం, పత్రాలు తీసుకుని రెండు, మూడు నెలల్లో మిగతా సొమ్ము ఇస్తామని చెప్పి అక్కడినుంచి ఉడాయించేవారు.

ఇలా తెలంగాణవ్యాప్తంగా రూ.2 కోట్ల విలువైన 8 కొత్త లారీలను చోరీచేశారు. వాటిని తుక్కు కింద రూ.32 లక్షలకు విక్రయించారు. తమ మాటలను నమ్మనివారి వాహనాలను దొంగిలించి విక్రయించడం లేదా తుక్కుగా మార్చడం చేసేవారు. 5 ఎక్స్‌కవేటర్లను దశరథ్‌ ముఠా ముంబయికి తరలించింది. ముంబయికి చెందిన మరో ముఠాతో కలిసి కంబోడియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా దేశాలకు తరలించినట్లు మట్టెవాడ ఠాణా పోలీసులు గుర్తించారు.

ఇలా వెలుగులోకి : ఈ నెల 5న వరంగల్‌లో ఓ కారు యజమానిపై దశరథ్‌ ముఠా దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి వాహనంతో ఉడాయించింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే దశరథ్‌ ముఠా బాగోతం బయటపడింది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలతో డీసీపీ బారీ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏపీలోని అనంతపురంతో పాటు ఖమ్మం, హైదరాబాద్‌లలో ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Heavy Vehicles Smuggling Scam Updates : అనంతపురంలో టిప్పర్లను, చైన్‌ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వరంగల్‌ ములుగురోడ్డులో దాచిన కార్లను తరలించడానికి ముఠా సిద్ధమవుతుండగా వాటిని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే 5 కార్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.8 కోట్ల విలువైన వాహనాలను దశరథ్‌ ముఠా చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాటిలో రూ.2 కోట్ల విలువైన వాహనాలను రికవరీ చేశారు.

దేశవ్యాప్తంగా దశరథ్, అతని ముఠాపై వందకుపైగా కేసులు ఉన్నాయి. గతంలో కర్ణాటక, దిల్లీ, ముంబయి ప్రాంతాల్లో కార్లు చోరీ చేసిన ఘటనలో దశరథ్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల క్రితమే జైలు నుంచి బయటకొచ్చాడు. మళ్లీ పాత దందా కొనసాగించాడు. పోలీసులకు చిక్కితే కోర్టు కేసులు పరిష్కరించడానికి ఓ లాయర్‌ను, ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఓ ఫైనాన్షియర్‌ను దశరథ్‌ ముఠా నియమించుకోవడం గమనార్హం. ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దశరథ్‌ సుమారు రూ.2 కోట్ల విలువైన భవనం నిర్మించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

5 వేల వాహనాలు చోరీ.. ఎట్టకేలకు చిక్కిన గజదొంగ

50కిపైగా వాహనాలు చోరీ చేశాడు.. పోలీసులకు ఇలా చిక్కాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.