ETV Bharat / state

YUVA : కష్టాలకు ఎదురీత జివాంజీ దీప్తి - పారా అథ్లెటిక్స్​లో సత్తా చాటిన వరంగల్​ బిడ్డ - Special Story On Deepthi Jeevanji - SPECIAL STORY ON DEEPTHI JEEVANJI

Special Story On Deepthi Jeevanji : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ నేపథ్యం ఆమెది. ఓ వైపు పేదరికం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు మరో వైపు మానసిక లోపం సమస్య! అయినా ఆమె నా తలరాత ఇంతే అని కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో సరికొత్తమార్గం వైపు పయనించింది. పట్టుదల, అకుంఠిత దీక్షతో తన లక్ష్యం వైపుగా ముందడుగు వేసింది. కట్​ చేస్తే అథ్లెట్లలో అత్యన్నత శిఖరాలను అధిరోహించింది. ప్రపంచ ఛాంపియన్​గా నిలిచింది. ఈ ఘనత సాధించింది ఎవరో కాదు మన తెలంగాణ బిడ్డ. ఆమె విజయగాథ ఎంటో తెలుసుకుందామా?

Special Story On Deepthi Jeevanji
Special Story On Deepthi Jeevanji (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 7:18 PM IST

Special Story On Deepthi Jeevanji : తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే గానీ ఇళ్లు గడవని కుటుంబ నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికంతో అంతంత మాత్రమే ఉన్న ఆర్థిక పరిస్థితి. మరోవైపు మానసిక లోపం సమస్య! ఆమె పడని ఇబ్బంది లేదు. ఎదుర్కోని అవమానం లేదు. ఇన్ని సమస్యల్లోనూ ఆమె ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇంటిని, ఊరిని విడిచిపెట్టి సరికొత్త మార్గంలో పయనించింది. అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదలే ఆయుధాలుగా ప్రపంచ ఛాంపియన్​గా నిలిచింది. అథ్లెటిక్స్​లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. ఆ అమ్మాయే జీవాంజి దీప్తి.

ఇదీ దీప్తి విజయ ప్రస్థానం : దీప్తిది వరంగల్‌ జిల్లాలోని కల్లెడ గ్రామం. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మిని కుమార్తెకు ఎదురయ్యే అవమానాలు మానసికంగా మరింత కుంగదీసేవి. అయితే భారత జూనియర్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ దృష్టిలో పడటం దీప్తి కెరీర్‌ మరో మలుపు తిరిగింది. వరంగల్‌లో పాఠశాల మీట్‌లో దీప్తిని చూసిన ఆయన శిక్షణ కోసం హైదరాబాద్‌కు పంపించమని దీప్తి తల్లిదండ్రులకు సూచించాడు.

బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తానే భరించి ఆమెను హైదరాబాద్​కు తీసుకొచ్చి మంచి శిక్షణ ఇప్పించాడు. ఈ క్రమంలోనే ‘లక్ష్య’ మార్గనిర్దేశకుడు పుల్లెల గోపీచంద్‌ చొరవతో ఆమె మానసికలోపమున్న అథ్లెట్ల పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీల్లో బరిలో దిగేందుకు అవసరమైన అనుమతుల కోసం మొరాకో, ఆస్ట్రేలియా టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకోసం పుల్లెల గోపీచంద్‌ రూ.3 లక్షలు వెచ్చించి దీప్తి భవితకు బాటలు వేశాడు.

మొరాకో నుంచి కోబె వరకు : ఆర్థికంగా కొంత మద్దతు, అత్యున్నతమైన శిక్షణ లభించడంతో దీప్తి ప్రదర్శన బాగా మెరుగైంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. 2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో ఆమె టీ20, 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. దీప్తికి ప్రతిభకు దక్కిన తొలి అంతర్జాతీయ స్వర్ణమిదే. 400తో పాటు 200 మీటర్లలోనూ తన సత్తా చాటింది. అదే ఏడాది బ్రిస్బేన్‌ వేదికగా వర్చుస్‌ ఆసియానియా పోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచిన ఆమె 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

Para Badminton: విధిరాతను ఎదిరించి.. పారా బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతున్న శ్రీకాకుళం యువతి

Warangal Girl Talent In Paralympics : ప్రతి పోటీలోనూ అదే స్పీడు కొనసాగిస్తూ వెళ్లిన దీప్తి 2023 పారా ఆసియా క్రీడల ప్రదర్శనతో తన ప్రతిభతో మరో ఎత్తుకు ఎదిగింది. ఈ క్రీడల్లో 400 మీటర్లను 56.69 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంతో నిలవడంతో పాటు ఆసియా రికార్డును సొంతం చేసుకుందామె. ఆ ఘన విజయం సొంతం చేసుకున్న తర్వాత దీప్తిపై ప్రశంసల వర్షం కురిసింది. కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఇంటికొచ్చి అభినందించడం దీప్తి కుటుంబం కలలో కూడా ఊహించని ఘటనలే.

పుల్లెల గోపీచంద్‌ సిఫార్సుతో ‘లక్ష్య’ గొడుగు కిందకి వచ్చిన దీప్తికి మరింత మెరుగైన శిక్షణ లభించింది. అంతర్జాతీయ స్థాయి వసతులు, ట్రైనింగ్​ అందించడంతో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన దీప్తి లక్ష్య’ అండ, మద్దతుతో పతకం నెగ్గడం ఖాయమని గోపీచంద్, రమేశ్‌ ఆశాభావం వ్యక్తంజేస్తున్నారు.

Sheetal Devi Archery : చేతులు లేకున్నా సడలని విశ్వాసం.. రెండు స్వర్ణాలు, ఓ రజతంతో ఎందరికో స్ఫూర్తిగా.. ​

Para Asian Games 2023 : పారా ఆసియా క్రీడల్లో తెలుగు తేజాలు అదరహో.. భారత్ ఖాతాలో పసిడి జాతర!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.