Vontimitta Kodanda Rama Swamy Brahmotsavalu Arrangements: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అధికారులతో కలసి క్షేత్రస్థాయి పరిశీలన, సమీక్ష జరిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు.
ఉరవకొండలో నేటి నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాలకు, స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నెలరోజుల ముందు నుంచే టీటీడీ ఈ పనులను ప్రారంభించిందని వీరబ్రహ్మం తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు.
గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్టేట్ ఆఫీసర్ గుణభూషణ రెడ్డి, డిప్యూటీ ఈవో నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో జ్ఞానాంబిక కళ్యాణోత్సవం- ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్లు
"కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 22వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం నిర్వహించనున్నాం. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపి అనేక సూచనలు చేశాం. " - వీరబ్రహ్మం, టీటీడీ జేఈవో