Volunteers in Election Campaigning: వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోరాదని ఎన్నికల సంఘం పదే పదే చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవేవీ అమలు కావడం లేదు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని బూత్ నెం-98లో అంగిరేకుల వంశీకృష్ణ, పాపి నాగార్జున అనే ఇద్దరు వాలంటీర్లు పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎన్నికల ఆదేశాలు తమకేవీ పట్టవు అన్నట్టుగా వాలంటీర్లను వైసీపీ నేతలు ప్రచారంలో వినియోగించుకుంటున్నారు.
వాలంటీర్ల అత్యుత్సాహాం- వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు
వైసీపీ ఇన్ఛార్జ్తో భుజాల మీద చేతులు వేసుకొని: వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిబంధనను ఎన్నికల కమిషనర్ విధించినప్పటికీ నిబంధనలకే తప్ప అమల్లో లేని పరిస్థితి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో దర్శనమిస్తోంది. వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించగా నేనేమీ తక్కువ కాదంటూ ఓ ఆర్టీసీ కండక్టర్ కూడా వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పెద్ద చెర్లోపల్లి మండలం నేరేడుపల్లి, పోతవరం, వరిమడుగు గ్రామాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో లక్ష్మక్క పల్లి గ్రామ సచివాలయానికి చెందిన మూలే మాలాద్రి, లింగన్నపాలెంకు చెందిన మాచర్ల మాలాద్రి అనే ఇద్దరు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలులాగా వ్యవహరించారు.
వైసీపీ నేతలు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఈ ఇద్దరు వాలంటీర్లు వైసీపీ ఇన్ఛార్జ్తో భుజాల మీద చేతులు వేసుకొని ముందుండి ప్రచారం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇదిలా ఉండగా నేనేమీ తక్కువ కాదంటూ కనిగిరి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్టీసీ ఉద్యోగి కూడా వైసీపీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాడు.
ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు-వాలంటీర్లే కర్త,కర్మ,క్రియ గా వైసీపీ ప్రచారం
ఎన్నికల విధుల్లో, ప్రచార కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధనను ఎన్నికల అధికారులు కఠినతరం చేసినప్పటికీ వాలంటీర్లు మాత్రం వాటిని తుంగలో తొక్కి వైసీపీ ప్రచార కార్యకర్తల్లా యథేచ్ఛగా వైసీపీ నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈనెల 17 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా దానిని ఉల్లంఘిస్తూ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులు వైసీపీ నాయకులతో కలిసి పార్టీ ప్రచారంలో పాల్గొనడాన్ని విపక్ష పార్టీలు తప్పు పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా సజావుగా జరిగేందుకు తోడ్పడాలని పలువురు కోరుకుంటున్నారు.
గ్రామ వాలంటీర్లే ప్రచారకర్తలు: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో కొత్త మల్లంపేటలో గ్రామ వాలంటీర్లు ప్రచార కర్తలు అవతారం ఎత్తారు. కేంద్ర ఎన్నికల కోడ్ వచ్చినా ఎక్కడ భయం బెరుకు లేకుండా జగనన్న సైన్యం అంటూ గడపగడపకు సంక్షేమం ప్రతులు పట్టి ప్రచారం చేశారు. ఇదేంటమ్మా కోడ్ కదా ఇలాంటి పనులేంటి అని అడిగితే, జగన్ను గెలిపించుకోవాలని అనుకుంటున్న అందుకే ఇలా చేస్తున్నా అని నిసిగ్గుగా చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చెయ్యగా, విచారణ చేసి స్థానిక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పంపారు. అనకాపల్లి జిల్లాలో ఇదే తరహాలో వాలంటీర్లు ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారని ప్రజలు చెప్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా ఇదే తరహా ప్రవర్తనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని ప్రజానీకం కోరుకుంటున్నారు.
అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు