ETV Bharat / state

ప్రధాన నిందితుడు శ్రీకాంతే! 14 రోజుల రిమాండ్ విధించిన అమలాపురం కోర్టు

వాలంటీర్​ హత్య కేసులో మాజీ మంత్రి తనయుడు

volunteer_murder_case_updates
volunteer_murder_case_updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 10:34 AM IST

Volunteer Murder Case Updates Ex Minister Pinepe Vishwaroop Son Shrikant in Remand : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంచలనం రేపిన దుర్గాప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా చెబుతున్న మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్​కు అమలాపురం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీకాంత్‌ను కోర్టులో హాజరు పరిచే క్రమంలో మంగళవారం రోజంతా తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

దళిత యువకుడు అయినవిల్లికి చెందిన వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో తమిళనాడులోని మధురైలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి విశ్వరూప్​ తనయుడు శ్రీకాంత్‌ను మంగళవారం ఉదయం కోర్టులో హాజరు పరుస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే శ్రీకాంత్​ని ఎక్కడికి తీసుకొచ్చారు? ఎప్పుడు కోర్టులో హాజరు పరుస్తారు అనే విషయంలో పోలీసులు గోప్యత పాటించారు.

Pinipe Srikanth Arrest : సాయంత్రం 4 గంటల సమయంలో అమలాపురంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్‌లో ప్రవేశపెడతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే శ్రీకాంత్‌ను రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కొత్తపేట డీఎస్పి కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. కొత్తపేట డీఎస్పీ గోవిందరావు కేసు వివరాలు వెల్లడించారు. దుర్గాప్రసాద్‌కు, శ్రీకాంత్‌కు ఉన్న వ్యక్తిగత కారణాలు, మనస్పర్థలే హత్యకు దారి తీశాయని డీఎస్పీ వివరించారు.

దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు?

2022 జూన్​ 6న జరిగిన వాలంటీర్​ దుర్గాప్రసాద్​ హత్య కేసును మొదట అదృశ్యం కేసుగా నమోదు చేశారు. పోస్టమార్టం నివేదిక ఆధారంగా దాన్ని హత్యగా గుర్తించారు. అప్పుడు పినిపె విశ్వరూప్​ మంత్రి ఉన్నారు. ఆయన ఆదేశలమేరకు కేసును పక్కకు పెట్టారని తాజాగా మంత్రి వాసంశెట్టి సుభాష్​ ఆరోపించారు.

కొత్తపేట నుంచి అమలాపురం కోర్టుకు తరలించే క్రమంలో మీడియా ప్రతినిధులని చూసి శ్రీకాంత్ ఒక్కసారిగా ఆవేశంగా మాట్లాడాడు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీకాంత్​కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 11 గంటల సమయంలో అమలాపురంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. నవంబర్ 4 వరకు 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

వాలంటీర్ హత్య కేసు - వైఎస్సార్సీపీ మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.