ETV Bharat / state

భీంపల్లికి జరమొచ్చింది - ఎన్ని గోలీలు మింగినా మళ్లమళ్ల వస్తంది - ఏం జరుగుతోంది? - Seasonal Diseases In Hanamkonda - SEASONAL DISEASES IN HANAMKONDA

Seasonal Diseases In Hanamkonda District : వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా సీజనల్​ వ్యాధులు ప్రజలపై పంజా విసురుతున్నాయి. ఓ ఊరంతా జ్వరంతో మంచంపట్టింది. ఆ గ్రామంలో ఎవరిని కదిలించినా జ్వరంతో బాధపడుతున్నామని చెబుతున్నారు. దీనిపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పకడ్బందీ చర్యలు చేపట్టి వ్యాధులను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. హనుమకొండ జిల్లా భీంపల్లి గ్రామ పరిస్థితిపై కథనం.

Seasonal Diseases In Hanamkonda Dist
Seasonal Diseases In Hanamkonda Dist (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 2:41 PM IST

Villagers Suffering From Seasonal Diseases : వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ ఊరిలోని ప్రతి ఇళ్లూ మంచం పట్టింది. కుటుంబంలో ముగ్గురు, నలుగురు జ్వరాల బారిన పడ్డారు. భరించలేని ఒళ్లు నొప్పులతో కాలు కదపలేని స్ధితిలో మంచానికే అతుక్కుపోయారు. వైద్య శిబిరాలు పెట్టి చికిత్స అందిస్తున్నా కోలుకోవడం లేదు.

Rising Cases Of Fever : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామం మొత్తం మంచం పట్టింది. ఊరిలో 130 మంది జ్వరం బారిన పడ్డారని వైద్యులు చెబుతున్నా అది రెట్టింపు సంఖ్యలో విజృంభిస్తోంది. గ్రామంలో ఎవరిని కదలించినా జ్వరంతో బాధపడుతున్నామనే సమాధానం వస్తోంది. జ్వరం కాస్త తగ్గిందనుకునేలోగా భరించలేని కండరాల నొప్పులతో కదలలేక పోతున్నామని వాపోతున్నారు. ఏ పని చేసుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నాని ఆవేదన చెందుతున్నారు.

భీంపల్లికి జరమొచ్చింది - ఎన్ని గోలీలు మింగినా మళ్లమళ్ల వస్తంది - ఏం జరుగుతోంది? (ETV Bharat)

'గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాం. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాం. నొప్పులతో కూడిన జ్వరాలు వస్తున్నాయి. దీంతో మా పనులు చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ట్యాబ్లెట్​లు వేసుకున్నతర్వాత తగ్గినట్టే తగ్గి మళ్లీ జర్వాలు వస్తున్నాయి' అని బాధితులు చెబుతున్నారు.

ఒక్కొక్కరిగా జ్వరం బారిన పడుతున్న ప్రజలు : ఇంట్లో ఒక్కొక్కరిగా అందరూ జ్వరం బారిన పడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మందులిచ్చినా తగ్గకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వేలల్లో ఖర్చు చేసినా చేతులు, కాళ్ల నొప్పులు పోవడం లేదంటున్నారు. జర్వాలు నెలరోజుల నుంచి ప్రబలుతున్నా గత వారంలో విపరీతంగా కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు.

"భీంపల్లి గ్రామంలో ఫీవర్​ సర్వేలు, ర్యాపిడ్​ టెస్ట్​లు నిర్వహించి ఇబ్బంది ఉన్నవారిని ఆసుపత్రికి పీహెచ్​సీకి రిఫర్​ చేస్తున్నాం. జ్వరాలు రెండు మూడు రోజుల్లో తగ్గి, కీళ్ల నొప్పులు ఉంటున్నాయి. ఇప్పటికే మూడు స్పెషల్​ క్యాంపులను నిర్వహించాము"- పద్మశ్రీ, పీహెచ్​సీ వైద్యురాలు

అవసరమైన మందులు సరఫరా చేస్తున్నాం : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన మందులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా జ్వరాలు మాత్రం తగ్గట్లేదు. మొక్కుబడిగా వైద్య శిబిరాలు నిర్వహించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టి వ్యాధులను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

వానాకాలం వ్యాధులతో జాగ్రత్త - నిపుణుల సూచనలు ఇవే! - Prathidwani On Seasonal diseases

రాష్ట్రంలో పంజా విసురుతున్న సీజనల్​ వ్యాధులు - స్వీయ రక్షణే ముఖ్యం - telangana seasonal diseases

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.