ETV Bharat / state

జగన్‌పై రాయితో దాడి చేస్తే హత్యాయత్నమా? - అదే ప్రతిపక్ష నేతపై జరిగితే కాదా? ఇదేం లాజిక్ కాంతిరాణా! - Stone Attack On CM Jagan

Vijayawada CP Kanthi Rana Tata on Stone Attack on CM Jagan: ముఖ్యమంత్రి జగన్‌పైకి ఎవరో ఆగంతకుడు రాయి విసరడం విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం! ఆ ఘటన తీవ్రత, పరిస్థితుల్నిబట్టి ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. అదే ప్రతిపక్షనేత రెండేళ్ల క్రితం చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన దర్యాప్తులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తన వైఖరిని స్పష్టంగా చాటిచెప్పారు.

Vijayawada CP Kanthi Rana Tata on Stone Attack on CM Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 6:56 AM IST

Updated : Apr 16, 2024, 9:00 AM IST

జగన్‌పై రాయితో దాడి చేస్తే హత్యాయత్నమా? - అదే ప్రతిపక్ష నేతపై జరిగితే కాదా? ఇదేం లాజిక్ కాంతిరాణా!

Vijayawada CP Kanthi Rana Tata on Stone Attack on CM Jagan : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి పైకి ఎవరో ఆగంతకుడు రాయి విసరడం విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం! ఆ ఘటన తీవ్రత, పరిస్థితుల్నిబట్టి ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని విలేకర్లు ప్రశ్నిస్తే, కాదు రాయి విసరడం వల్లే దాడి జరిగిందని తేల్చి చెప్పారు. అదే ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడుపై రెండేళ్ల క్రితం జరిగిన దాడి ఘటన దర్యాప్తులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తన వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు.

సీఎం భద్రత కోసం విద్యుత్ తొలగించాం- బలంగా రాయి విసిరినట్లు తెలుస్తోంది: సీపీ కాంతి రాణా - Stone Attack on CM Jagan

CP Kanthi Rana Tata on Stone Attacks : సీఎం జగన్‌పై రాయిదాడి ఘటనను విజయవాడ సీపీ కాంతి రాణా తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే కాంతి రాణా 2022 నవంబరు 4న మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నందిగామలో రాళ్ల దాడి జరిగినప్పుడూ సీపీగా ఉన్నారు. అప్పుడు మాత్రం ఆయన ఆ ఘటనను తేలిక చేసి మాట్లాడారు. వెంటనే కేసు కూడా నమోదు చేయలేదు. టీడీపీ నేతలు ఒత్తిడి పెంచడంతో అతి కష్టం మీద సెక్షన్ 324 కింద కేసు కట్టారు. ఇంత వరకు నిందితులెవరో గుర్తించలేదు. అసలా కేసు దర్యాప్తు జరుగుతుందో లేదో కూడా తెలీదు.

నిందితుల వివరాలు చెబితే పారితోషికం - సీఎం జగన్​పై దాడి కేసులో సీపీ ప్రకటన - CM JAGAN CASE

Stone Attack on Chandrababu Naidu : అప్పుడూ, ఇప్పుడూ సీపీ ఒక్కరే. జరిగింది ఒకే తరహా ఘటనలు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి మరొకరు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి. కానీ అప్పుడూ, ఇప్పుడూ సీపీ స్పందించిన తీరే ఆయన ఏకపక్ష వైఖరికి అద్దం పట్టింది. ఎంత అధికార పార్టీతో అంటకాగితే మాత్రం బాధ్యతాయుతమైన పోలీసు కమిషనర్ పోస్టులో ఉన్న అధికారి స్పందించేది ఇలాగేనా తన వైఫల్యాల్ని, పక్షపాతధోరణిని ప్రశ్నించిన మీడియా, విపక్షాలపై కాంతి రాణా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారే!

తమపై నిరాధార, ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని గింజుకున్నారే! పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయడానికి అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని తెగ బాధపడిపోయారే! పోలీసు అధికారులు ఏ పార్టీకి కొమ్ముకాయకుండా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎవరైనా వారిని ఎందుకు తప్పుపడతారు? మీరు ఏ మాత్రం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదనడానికి సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి జరిగిన సందర్భాల్లో మీరు స్పందించిన తీరే అద్దంపడుతోంది కదా!

ప్రతిపక్షనేతపై రాళ్లేస్తే అలా, సీఎంపై అయితే ఇలా- భద్రతా వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడరు? - YSRCP leaders ON YS JAGAN INCIDENT

Last Updated : Apr 16, 2024, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.