ETV Bharat / state

బుడమేరు వరద ఉద్ధృతి తగ్గడంతో కోలుకుంటున్న బెజవాడ - సహాయ చర్యలు ముమ్మరం - Vijayawada Recovering From floods - VIJAYAWADA RECOVERING FROM FLOODS

Vijayawada Floods Effect 2024 : బుడమేరు ఉద్ధృతితో వారం రోజులుగా ముంపులో ఉన్న విజయవాడ కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. నీరు తగ్గిన కాలనీల్లో ప్రభుత్వం పారిశుద్ధ్యం, విద్యుత్‌ పునరుద్ధరణ పనులను ముమ్మరం చేసింది. వైద్య సేవలను యుద్ధ ప్రాతిపదికన అందిస్తోంది.

Vijayawada Recovering From Floods
Vijayawada Floods Effect 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 7:49 PM IST

Updated : Sep 8, 2024, 8:11 PM IST

Vijayawada Recovering From Floods : బుడమేరుకు వరద తగ్గడంతో విజయవాడలోని కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వారం రోజులుగా జలదిగ్బంధంలోనే మగ్గిన భవానీపురం, సితార సెంటర్, విద్యాధరపురం నుంచి క్రమంగా నీరు వెళ్లి పోతోంది. జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, రాజరాజేశ్వరీ పేట, మిల్క్ ప్రాజెక్టు ప్రాంతంలో నీరు తగ్గింది. బుడమేరు కాలవకు పడిన గండ్లు పూడ్చివేయడంతో కాలనీల్లో నీరు తగ్గిందని స్థానికులు తెలిపారు. ఇన్నాళ్లు ఇబ్బందిపడ్డ తాము, ఇప్పుడిప్పుడే ఉపిరి పీల్చుకుంటున్నామని తెలిపారు.

"బుడమేరు మూడో గండి పూడ్చడంతో నగరంలో కొంతమేర వరద ఉద్ధృతి తగ్గింది. ఈ వరదల ధాటికి ముంపునకు గురైన ఇళ్లన్నీ బురదమయంగా మారి నిర్మాణాల సిల్ట్​ ఊడిపోయింది. వరదొచ్చిన మొదటి రెండు రోజులు బాగా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు పర్లేదు. వరద ఉద్ధృతి తగ్గింది. సర్కార్​ నుంచి సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి." -బాధితులు

నీరు తగ్గిన కాలనీల్లో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం : సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో పాదాలు తడిసేంత వరద నీరు నిలిచి ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వాంబే కాలనీలో క్రమంగా వరద తగ్గుతోంది. పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కార్మికులు ముమ్మరం చేశారు. కాలనీల్లో బ్లీచింగ్‌ చల్లే పక్రియ చురుగ్గా సాగుతుందని అధికారులు వెల్లడించారు.

"వరద వచ్చిన ఏడు రోజులు తరవాత ఇవాళ చూస్తే వరద నీటిమట్టం ఇంకా ఒక అడుగు మేరలో ఉంది. అందులో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అంతగా ఎఫెక్ట్​ కాలేదు. కానీ పశ్చిమ నియోజకవర్గం మాత్రం వరద ప్రభావం బాగానే పడింది. కాలనీల్లో బ్లీచింగ్‌ చల్లే పక్రియ చురుగ్గా సాగుతుంది. ఇందుకోసం బయటనుంచి కూడా 7,000 మందిని రప్పించి 250 వాహనాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి." -ధ్యానంచంద్ర, వీఎంసీ కమిషనర్

బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎడమ గట్టుపై పూడ్చిన గండ్లను పటిష్ఠపరిచే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శనివారం నుంచి ఏకధాటిగా వర్షం పడుతున్నా, గండ్లు పూడ్చిన ప్రాంతంలోనే ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. దిగువకు ఎలాంటి సీపేజీ లేకుండా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాలతో పులివాగుకు వరద ప్రవాహం పెరగడంతో బుడమేరకు 2,800 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం గండ్లు పూడ్చివేయటంతో ఆ నీరు బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా నేరుగా కృష్ణా నదిలో కలుస్తోంది. గండ్లు పూడ్చిన ప్రాంతంలో నీటి ప్రవాహం తగ్గడంతో రాయనపాడు సమీప ప్రాంతాలన్నీ బయటపడ్డాయి.

ఉత్తరాంధ్రలో హై అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - Red Alert Issued In North Andhra

రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! - ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు - Heavy Rains In Telangana Today

Last Updated : Sep 8, 2024, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.