Vigilance Report on Medigadda : మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ నిర్మాణం ప్లాన్ ప్రకారం లేదని రాఫ్ట్, సీకెంట్ ఫైల్స్ నిర్మాణం తగిన రీతిలో జరగలేదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. డ్రాయింగ్ ప్రకారం లేకపోవడమే నష్టానికి ప్రధాన కారణమైందని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 16 నుంచి 21 వరకు పియర్స్‌కు పగుళ్లు, రాఫ్ట్ వైఫల్యాలకు సపోర్టింగ్ మెటీరియల్ కోల్పోవడం కారణం కావచ్చని, ఇందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కారణమని తెలిపింది.
2019 జూన్ 21న బ్యారేజీ ప్రారంభించినప్పటి నుంచీ నిర్వహణ సరిగా లేదని, 2019లోనే సీసీ బ్లాకులు పక్కకెళ్లిపోవడం, ప్లింత్ శ్లాబ్ పారామెట్రిక్ జాయింట్‌ను గుర్తించినా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రమైందని విజిలెన్స్ తెలిపింది. ఇందుకు నిర్మాణ సంస్థ, నీటి పారుదల శాఖలే కారణమని రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. తమ పరిశీలనలో తేలిన అంశాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాజీవ్‌రతన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కాకుండా, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పర్యటన సందర్భంగా కూడా పలు వివరాలను వారు తెలిపారు.
మేడిగడ్డ పూర్తయినట్టా కానట్టా - విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు
Medigadda Barrage Damage Issue Updates : దెబ్బతిన్న వాటిని బాగు చేయాలని పలుమార్లు నీటి పారుదల శాఖ లేఖలు రాసినా, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. 2020 మే 18న, 2021 ఫిబ్రవరి 17న, 2022 ఏప్రిల్ 6న, 2023 ఏప్రిల్ 23న లేఖలు రాసినా స్పందనలేదని, కానీ ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు ఇంజినీర్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత కూడా కాఫర్ డ్యామ్, షీట్ ఫైల్స్‌ను ఐదు సీజన్ల పాటు తొలగించకపోవడం నది ప్రవాహాన్ని దెబ్బతీసిందని తెలిపింది.
ఒప్పందం ప్రకారం పని జరగలేదు : ఒప్పదం ప్రకారం బ్యారేజీ అప్పగింతకు సంబంధించిన పని జరగలేదని, వీటికి నిర్మాణ సంస్థ కారణమని నివేదికలో స్పష్టం చేసింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీని తనిఖీ చేయాలని పేర్కొంది. ఇందులో ఏమైనా గుర్తిస్తే రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అధికారులకు నివేదించి, ఏం చర్యలు తీసుకోవాలన్నది తెలుసుకోవాలని తెలిపింది. అయితే ఇలాంటి తనిఖీలు జరిగినట్లు కనిపించలేదని విజిలెన్స్ నివేదికలో తేటతెల్లం చేసింది.
'మేడిగడ్డ ఒప్పందాలు ముగిశాయి - పనులు చేయాలంటే కొత్త కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే'
బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేశారు : బ్యారేజీలో మేజర్ బ్లాకులు ఉప గుత్తేదారు నిర్మించినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వివరించింది. అకౌంట్స్‌పై విచారణ జరుపుతున్నామని పేర్కొంది. పనులు పెండింగ్‌లో ఉన్నా, బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేశారని తెలిపింది. దీనికి కారణం నీటి పారుదల శాఖ అని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance Report on Medigadda) నివేదికలో స్పష్టం చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు - విజిలెన్స్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు
మేడిగడ్డలో పని పూర్తైనా తొలగించని కాఫర్ డ్యాం - విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు