Rahul Gandhi Tweet on Tirumala Laddu Issue in AP : తిరుమలలో లడ్డూల కల్తీపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ట్వీటర్ వేదికగా స్పందించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తనను ఆందోళన కలిగిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పూజించే దేవుడు బాలాజీ అని పేర్కొన్నారు. అలాంటి ప్రసిద్ధ ఆలయంలో లడ్డూలు కల్తీ అయ్యాయన్న విషయం ప్రతి ఒక్క భక్తుడినీ బాధిస్తోందని తెలియజేశారు. దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని వ్యాఖ్యానించారు.
The reports about the defilement of the Prasad at Sri Venkateshwara temple in Tirupati are disturbing.
— Rahul Gandhi (@RahulGandhi) September 20, 2024
Lord Balaji is a revered deity for millions of devotees in India and across the world. This issue will hurt every devotee and needs to be thoroughly looked into.
Authorities…
Former Vice President Venkaiah Naidu Response : తిరుమల శ్రీవారి ప్రసాదాలపై వస్తున్న వార్తలు తనను ఎంతో కలిచివేశాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు కోట్ల మంది భక్తులకు ఇలవేల్పు అని వ్యాఖ్యానించారు. స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమపవిత్రంగా భావిస్తారని పేర్కొన్నారు. అంతే కాదు ఆత్మీయులకు శ్రీవారి ఆశీస్సులు లభించాలని అందరికీ పంచిపెట్టడం ఆచారంగా వస్తోందని తెలియజేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక వైశిష్ఠ్యం కలిగిన తిరుమల వేంకటేశ్వరుడి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైనా క్షమార్హం కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించానని తెలియజేశారు. అందుకు సీఎం అంగీకరించారని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ప్రసాదముల తయారీ విషయంలో వస్తున్న వార్తలు నన్ను ఎంతగానో కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయం గురించి ఫోన్లో మాట్లాడాను.
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 20, 2024
తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ… pic.twitter.com/wZnL4jVxTJ
Actor Prakash Raj Comment : తిరుమల లడ్డూ కల్తీ అంశంపై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఏపీలో ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై భక్తులపై భయాందోళనలు సృష్టించి జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో మతపరమైన ఉద్రిక్తతలున్నాయని తెలియజేశారు.
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024
MLA Raghuramakrishna Raju Reaction : వైఎస్సార్సీపీ హయాంలో శ్రీవారి భక్తుల్ని స్టూవర్ట్‌పురం దొంగల్లా దోచుకున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు జగన్‌ను ఆ శ్రీనివాసుడే ఓడించారని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో భగవంతుడిని భక్తుడికి దూరం చేయడం ఎలా అనే క్రిమినల్ ఆలోచనలతోనే బోర్డు నడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన పదార్థాలలో జంతువుల కొవ్వు ఉన్నట్టు పరీక్షల్లో నిర్ధరణ అయిందని వెల్లడించారు.
తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ వచ్చిన ల్యాబ్ నివేదికలు, తిరుమలలో గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలు తదితర ముఖ్య అంశాలపై ఈరోజు " మీడియా సమావేశం". pic.twitter.com/mKlCxuQbLj
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) September 20, 2024
తిరుమల లడ్డూ ఎలా తయారు చేస్తారు? - ఏయే వస్తువులు వినియోగిస్తారో తెలుసా! - How to make Tirumala Laddu
భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా సీఎం చంద్రబాబు చెప్పక తప్పని పరిస్థితి అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. తిరుమలలో భక్తులకు ఉచితంగా మంచినీటి సీసాలు అందజేయాలని సూచించారు. అద్దెగదుల ధరలు తగ్గించాలని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమే అని వ్యాఖ్యానించారు. తిరుమల కొండపై భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీఎం, దేవాదాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. టీటీడీ బోర్డు ఏర్పడక ముందే తిరుమలకు వెళ్తే ఈవోను కలిసి వివరిస్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు.