ETV Bharat / state

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు - కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌ - Vehicles Stuck at Kodada highway - VEHICLES STUCK AT KODADA HIGHWAY

Vehicles Stuck at Kodada due to Flooding : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పొటెత్తడంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. గంటల కొద్ది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను అధికారులు వెరే మార్గాలకు మళ్లించారు.

Vehicles Stuck at Kodada due to Flood
Vehicles Stuck at Kodada due to Flooding (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 10:52 PM IST

Vehicles Stuck at Kodada due to Flood : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయ. జాతీయ రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రయాణికులకు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్​ జిల్లాలోని నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది.

ఈ సందర్భంగా సూర్యాపేటలోని కోదాడ టోల్​ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంటల కొద్ది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో అధికారులు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే వాహనాలను ఖమ్మం వైపు మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలు నార్కట్‌పల్లి-అద్దంకి వైపు మళ్లించారు.

జలదిగ్భందంలో కాజ టోల్‌ప్లాజా : భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి జలదిగ్భందంలో చిక్కుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కాజ టోల్‌ప్లాజా వద్ద పరిస్థితి దారుణంగా మారింది. మోకాళ్ల లోతుకుపైగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీళ్లలో కార్లు, బైకులు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చిన్న వాహనాలు ఆగిపోవడంతో వాటిని పక్కకు తీసే వరకు బస్సులు, లారీలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నీళ్లలో ఇరుక్కుపోయిన వాహనాలను పోలీసులు అతి కష్టం మీద తొలగించారు. గుంటూరు-విజయవాడ మార్గంలో ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాలను త్వరగా క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

మరోవైపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్​ అలర్ట్​ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్​లోని అన్ని రకాల పాఠశాలలకు సోమవారం జిల్లా కలెక్టర్​ సెలవును ప్రకటించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్​ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్​ ఆదేశించారు.

సెప్టెంబరులో భారీ వర్షాలు- వరదలు వచ్చే ఛాన్స్!: IMD - September Rainfall India

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వానలే వానలు - పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ - Heavy Rain Alert To Telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.