Goddess on Gold Ornaments and Cash in Visakha : రాష్ట్రవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సుమారు 6 కేజీల స్వర్ణాభరణాలు, బంగారు చీర, బంగారు కిరీటం, బంగారు బిస్కెట్లతో పాటు 10 కేజీల వెండి సామగ్రి, వెండి బిస్కెట్లతో పాటు నాలుగు కోట్ల విలువైన కరెన్సీ నోట్ల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
కరెన్సీ నోట్ల అలంకారంలో అమ్మవారు : విశాఖలోని కురుపాం మార్కెట్ ప్రాంతంలో 147 ఏళ్ల పురాతన కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈరోజు (గురువారం) కరెన్సీ నోట్ల అలంకారంలో భక్తులకు కన్నుల పండువగా చేసింది. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారిని శ్రీమహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గర్భగుడిలో సుమారు 6 కేజీల స్వర్ణాభరణాలు, బంగారు చీర, బంగారు కిరీటం, బంగారు బిస్కెట్లతో పాటు 10 కేజీల వెండి సామగ్రి, వెండి బిస్కెట్లతో పాటు నాలుగు కోట్ల విలువైన కరెన్సీతో దేవిని అలంకరించారు. ఒక రూపాయి, రెండు, ఐదు, 10, 20, 50, 100, 200, 500 రూపాయల కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవిగా దుర్గమ్మ - దర్శనానికి పోటెత్తిన భక్తులు
తన్మయత్వం చెందిన భక్తులు : గర్భగుడి మొత్తాన్ని ధనాగారంగా మార్చేసిన వైనం భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. గురువారం తెల్లవారుజాము నుంచే శ్రీ కన్యకాపరమేశ్వరి మూలవిరాట్‌కు పాలు, పెరుగు, గంధం, తేనె వంటి 108 రకాల ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. వివిధ రకాల పూలతో అమ్మవారిని శ్రీమహాలక్ష్మి రూపంలో అలంకరించి స్వర్ణ వస్త్ర సహిత సకలాభరణాలు, 108 స్వర్ణ పుష్పాలతో నివేదన గావించారు. 22ఏళ్లగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో కరెన్సీ నోట్లు, బంగారం, వెండి ఆభరణాలతో అలంకరణ చేస్తున్నారు.
భక్తుల సొమ్ముతో అలంకరణ : భక్తులు స్వయంగా అందజేసిన సొమ్ముతో ఆ తల్లిని అలంకరించి, ఒక రోజు తర్వాత ఆ సొమ్మును తిరిగి భక్తులకు ఇచ్చేస్తారు. తమ సొత్తును అమ్మ అలంకరణలో వాడితే తమ వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతుందని, సామాన్య ప్రజానీకానికి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. దేవస్థాన, ఆస్థాన మండపంలో మహిళా విభాగ సభ్యులు దేవీ భాగవతం, బాలా త్రిపుర సుందరి దేవీ జపం, లలితా సహస్రనామం, సామూహిక పారాయణం చేసారు. 200మంది మహిళలు, అష్టలక్ష్మి పూజల్ని సామూహికంగా జరిపించారు.
మా అమ్మ బంగారం - ఏ అలంకారానికి ఏ ఆభరణమో తెలుసా? - Vijayawada Durga Devi Ornaments