Uttam Kumar Reddy Speech : నీటి పారుదల శాఖపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ తప్పిదాలు, అవినీతి, రాష్ట్రానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టాయని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ అన్నారు. భవిష్యత్ తరాలపై మోయలేని భారాన్ని మోపారని మండిపడ్డారు. ప్రపంచంలోనే అద్భుతం అన్న మేడిగడ్డ (Medigadda) మూడేళ్లలోనే కుంగిపోయిందన్నారు. కాగ్, ఎన్డీఎస్ఏ నివేదికలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
''కాళేశ్వరం' అంత అవినీతి ఎప్పుడూ జరగలేదు - అందుకే వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయింది'
Discussion Irrigation Department : గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో నీళ్ల దోపిడీ నాలుగింతలు అయిందని ఉత్తమ్‌కుమార్ ఆరోపించారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించి రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు 550 టీఎంసీలు తెచ్చుకునేసోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ అంగీకరించిందని తెలిపారు. అందులో ప్రాజెక్టులను అప్పగించేందుకు సమ్మతి తెలిపినట్లు ఉందన్నారు. దీనికి బోర్డు సమావేశాలు, మినట్స్, లేఖలే సాక్ష్యమని స్పష్టం చేశారు.
బీసీ కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలి : కేటీఆర్
Telangana Assembly Session 2024 : అన్నారం, సుందిళ్లకు ముప్పు పొంచి ఉందని మంత్రి (Uttam Kumar Reddy) తెలిపారు. రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అగమ్యగోచరంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు, వడ్డీల భారం పెరిగిపోయిందని పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి 1.35 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.
- కేసీఆర్ హయాంలో ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు ఖర్చు రూ.11 లక్షలు
- మిగిలిన 53 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ఖర్చు రూ.96 వేల కోట్లు
- రుణ భారం కోసం కావాల్సిన నగదు రూ.77 వేల కోట్లు
- మొత్తం రాష్ట్రానికి రూ.1.75 లక్షల కోట్లు అవసరమవుతాయని ఉత్తమ్ తెలిపారు.
Telangana Budget Session 2024 : కృష్ణా జలాల్లో కేసీఆర్ విధానాల వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాకు అన్యాయం జరిగిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల కడుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. టెండర్ల సమయంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వెళ్లకుండా వాయిదా వేయాలని లేఖ రాయడంతో అప్పటి సీఎం వైఖరి అర్థం అవుతోందని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి కింద రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా ఆయకట్టు రాలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒక్క మోటార్ నడిపి కొన్ని నీళ్లు ఎత్తిపోశారని వెల్లడించారు.
'రేవంత్ సాబ్ బీఆర్ఎస్ నుంచి ఏ ఇబ్బంది ఉండదు - కానీ మీ వాళ్లతో మాత్రం జరభద్రం'
"తెలంగాణకు కృష్ణా జలాల్లో 68 శాతం హక్కుగా రావాలి. ఈ విషయాన్ని గత ప్రభుత్వం ఏనాడూ అడగలేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే బోర్డుల పరిధికి నిర్ణయం జరిగింది. గత ప్రభుత్వం సవాలు చేయనందున నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ప్రాజెక్టులు అప్పగించేందుకు సూత్రప్రాయంగా గత ప్రభుత్వం అంగీకరించింది. బోర్డులకు రూ.200 కోట్ల సీడ్ మనీ ఇచ్చేందుకు గత బడ్జెట్ డిమాండ్ బుక్‌లో పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌పైకి ఏపీ పోలీసులు చొరబడినా గత ప్రభుత్వం నోరు మెదపలేదు."- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి
'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం