ETV Bharat / state

''కాళేశ్వరం' అంత అవినీతి ఎప్పుడూ జరగలేదు - అందుకే వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయింది' - Telangana Assembly Sessions 2024

Uttam Kumar Reddy on Irrigation Projects : కాళేశ్వరం ప్రాజెక్టును కాగ్‌ కూడా పరిశీలించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. దేశం, రాష్ట్రం అవాక్కయ్యే విషయాలను కాగ్‌ రిపోర్టులో పొందుపరిచారని చెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌, కాగ్‌ రిపోర్టుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇస్తున్నట్లు ఉత్తమ్‌ వెల్లడించారు.

uttam kumar reddy
uttam kumar reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 11:27 AM IST

Updated : Feb 17, 2024, 12:04 PM IST

మేడిగడ్డలోనే కాదు అన్నారంలో కూడా లోపాలున్నాయి

Uttam Kumar Reddy on Irrigation Projects : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు శాసనసభలో నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల అంశంపై చర్చ నడుస్తోంది. పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా శ్వేతపత్రంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చర్చను ప్రారంభించారు. డిజైన్‌, నాణ్యత లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని చెప్పారు. వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయిందని ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వాత నీటి పారుదల రంగంలో ఇంతపెద్ద అవినీతి ఎప్పుడూ జరగలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.

డ్రాయింగ్​లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం

White Paper on Irrigation Projects : ప్రాజెక్టులపై సలహాలు, సూచనలు ఇచ్చే అధికారం నేషనల్‌ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉందని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. వారి పరిశీలనలో కీలక అంశాలు గుర్తించారని పేర్కొన్నారు. ప్లానింగ్‌, డిజైన్‌, నాణ్యతా, నిర్మాణ లోపాలున్నాయని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసిందని అన్నారు. ప్రాజెక్టు నిర్వహణలోనూ నిర్లక్ష్యం ఉందని తెలిపిందని వివరించారు. ప్రమాదం జరిగిన 2023 అక్టోబర్‌ 21న కేసీఆర్‌ ప్రభుత్వమే ఉందని, కానీ అక్టోబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 7 వరకు ప్రమాదంపై గత ముఖ్యమంత్రి ఒక్క మాటా మాట్లాడలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.

"మేడిగడ్డ బ్యారేజీ 2019లో పూర్తయింది. 2019 నుంచి 4 ఏళ్లపాటు పర్యవేక్షణ, నిర్వహణ సరిగా చేయలేదు. అన్నీ తెలిసి అందరి నిర్లక్ష్యం వల్లే ఆనకట్ట పియర్స్‌ దెబ్బతిన్నాయి. మేడిగడ్డకు వాడిన సాంకేతిక సామగ్రినే అన్నారం, సుందిళ్లకు వాడారు. అన్నారం, సుందిళ్లను నీటితో నింపవద్దని ప్రభుత్వానికి ఎన్‌డీఎస్‌ఏ సలహా ఇచ్చింది. మేడిగడ్డలోనే కాదు అన్నారంలో కూడా లోపాలున్నాయి. లీకులు మొదలయ్యాయి. గతంలో నీటి పారుదల శాఖ నిర్వహణ చూసిన వారు ఈ ఘటనతో తలదించుకోవాలి. నీటి పారుదల శాఖ నిర్వహించినవారు తెలంగాణకు క్షమాపణ చెప్పాలి." - ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

Telangana Assembly Sessions 2024 : శుక్రవారం నుంచి అన్నారం బ్యారేజీలో లీకులు భారీగా ప్రారంభమయ్యాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై నేషనల్‌ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పిలిచామని చెప్పారు. వారు అన్నారంలో నీళ్లు ఖాళీ చేయాలని తెలిపారని వివరించారు. మేడిగడ్డ (Medigadda Barrage) మాదిరిగా అన్నారంలో ప్రమాదం పొంచి ఉందని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

'మేడిగడ్డ ప్రమాదంపై మేం అధికారంలోకి రాగానే విజిలెన్స్‌ విచారణ చేయించాం. నిర్మాణంలో అనేక లోపాలున్నట్లు విజిలెన్స్‌ గుర్తించింది. 2019 జూన్‌ 19న నాటి సీఎం బ్యారేజీని ప్రారంభించారు. ఆనకట్ట ప్రారంభించినప్పటి నుంచి పర్యవేక్షణ, నిర్వహణ పట్టించుకోలేదని విజిలెన్స్‌ నివేదించింది. నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు విజిలెన్స్‌ నివేదించింది. అందుకే రామగుండం ఈఎన్‌సీని ఉద్యోగం నుంచి తొలగించామని' ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

Uttam Power Point presentation on Irrigation Projects : కాళేశ్వరం ప్రాజెక్టును కాగ్‌ కూడా పరిశీలించిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. దేశం, రాష్ట్రం అవాక్కయ్యే విషయాలను కాగ్‌ రిపోర్టులో పొందుపరిచారని చెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌, కాగ్‌ రిపోర్టుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం

'రియాల్టీకి దూరంగా భ్రమలు కల్పిస్తే ప్రమాదం - అందుకే వాస్తవ పద్దు రూపొందించాం'

Last Updated : Feb 17, 2024, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.