ETV Bharat / state

రాష్ట్రంలో పలు చోట్ల వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage in Telangana - CROP DAMAGE IN TELANGANA

Paddy Damage in Telangana : రాష్ట్రంలో అకాలవర్షం రైతుల్ని మరోసారి ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వడగాళ్ల వానకు నేలపాలైంది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కళ్లముందే తడిసిముద్దవుతుంటే ఏం చేయాలో తెలియక అన్నదాతలు తల్లడిల్లిపోయారు.

Crop Damage in Telangana
Paddy Damage in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 8:13 AM IST

రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన అకాల వర్షాలు - తడిసి ముద్దయిన ధాన్యం

Crop Damage in Telangana : రాష్ట్రంలో రైతులను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బస్వాపూర్​లో పశువుల పాక కూలి రెండు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి.

Heavy Rains In Telangana : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. చెల్లా చెదురైన వడ్లను కుప్పగా పోసి కవర్లు కప్పారు. దుబ్బాక మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీటిపాలైంది. కోహెడ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. మరోవైపు రాష్ట్రంలో రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

"అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. చేతికి వచ్చిన పంట అంతా నష్టపోయాం. అప్పుల సమస్య ఎక్కువైంది. సమస్యలు పెరిగిపోయాయి. ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి." - బాధిత రైతులు

Crop Loss Due To Rainfall In Siddipet : దుబ్బాక మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుందన్నారు. రోజుల తరబడి కేంద్రాల్లో అన్నదాతలు నిరీక్షించవలసి వస్తుందని తెలిపారు. ధాన్యం తరలించడానికి ప్రభుత్వం లారీలను అందుబాటులో ఉంచాలన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అధికారులు సహకరించకపోవడంతో మరిన్ని సమస్యలు ఎదురవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ పంట బోనస్ రూ 500 చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

అకాల వర్షాలతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం - ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి : పల్లా - BRS MLA Palla on Untimely Rains

హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం - పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు - Rain in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.