ETV Bharat / state

లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్‌ - ‘శ్రీవారి ఫొటోలు తొలగించేందుకు జగన్‌అండ్‌ కో యత్నం’: కేంద్రమంత్రి తీవ్ర ఆరోపణలు - Union Ministers on Tirumala Laddu - UNION MINISTERS ON TIRUMALA LADDU

Central Ministers on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్ర మంత్రులు స్పందించారు. ఈ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేసే అంశమని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని తెలిపారు.

Union Ministers on Tirumala Laddu
Union Ministers on Tirumala Laddu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2024, 2:32 PM IST

Updated : Sep 20, 2024, 10:02 PM IST

Tirupati Laddu Ghee Issue : తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పూర్తి నివేదికను కోరినట్లు నడ్డా తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ఇదే అంశంపై కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనదన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పారు. లడ్డూ కల్తీ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేసే అంశమని ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినదని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ట్వీట్‌ చేశారు. తిరుమల కాలేజీల్లో శ్రీవారి ఫొటోలు తొలగించాలని జగన్ అండ్‌ కో చూసిందని ఆమె ఆరోపించారు. హిందూయేతర గుర్తులు సప్తగిరులపై ఏర్పాటు చేయాలని చూశారని విమర్శించారు. హిందువులు కానివారిని బోర్డ్‌ ఛైర్మన్‌గా నియమించారని ఆక్షేపించారు. జంతువుల కొవ్వులను పవిత్ర ప్రసాదంలో కలిపారని దుయ్యబట్టారు. స్వామీ ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలకు మమ్ము క్షమించు అని శోభా కరంద్లాజే వ్యాఖ్యానించారు.

Bandi Sanjay Letter to Chandrababu : మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ అంశం హిందువుల మనోభావాలను కలిచి వేస్తుందని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా గతంలో పట్టించుకోలేదని ఆరోపించారు. లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం నీచమని విమర్శించారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లే భావిస్తున్నామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

నెయ్యిని కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారని బండి సంజయ్ అన్నారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ లేఖలో వివరించారు.

వైఎస్సార్సీపీ నేతలు తిరుమల లడ్డూనూ అపవిత్రం చేశారా? - రాజకీయ దుమారం - FAT IN TIRUMALA LADDU ISSUE

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు- ముప్పేట దాడికి దిగిన రాజకీయ పార్టీలు - Tirupati Laddu Ghee Issue

Last Updated : Sep 20, 2024, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.