ETV Bharat / state

రాష్ట్రంలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం - మిథున్‌రెడ్డి ప్రశ్నకు గడ్కరి వివరణ - NITIN GADKARI ON FLYOVER IN AP

లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి ఫ్లైఓవర్ల నిర్మాణాలపై ప్రశ్న - కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి సమాధానం

Union Minister Nitin Gadkari on Flyovers on National Highway
Union Minister Nitin Gadkari on Flyovers on National Highway (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2024, 8:06 AM IST

Union Minister Nitin Gadkari on Flyovers on National Highway : ఆంధ్రప్రదేశ్​లో జాతీయ రహదారులపై రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రవాణా, రహదారి శాఖమంత్రి నితిన్‌ గడ్కరి తెలిపారు. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (MP Mithun Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి నితిన్‌ గడ్కరి సమాధానం : ఎన్‌హెచ్‌-216ఎపై మోరంపూడి, ఉండ్రాజవరం జంక్షన్, జొన్నాడ, తేతలి, కైకరం వద్ద నిర్మిస్తున్న ఐదు వంతెనలు 2025 ఏప్రిల్‌ 2 నాటికి పూర్తి అవుతాయని తెలిపారు. ఎన్‌హెచ్‌-16పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్‌ల వద్ద నిర్మిస్తున్న 2 వంతెనలు 2025 సెప్టెంబర్‌ 11కి, విశాఖపట్నం ఎయిర్‌పోర్టు జంక్షన్‌ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ 2025 ఫిబ్రవరి 15కి, గుంటూరు మిర్చి యార్డు వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6వ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఎన్‌హెచ్‌-16పై నాగులుప్పలపాడు గ్రోత్‌సెంటర్, రాజుపాలెం జంక్షన్‌ల వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాణాలకు అనుమతి లేఖలు ఇచ్చామని, ఇదే జాతీయ రహదారిలో రాజుపాలెం క్రాస్‌రోడ్డు, జొన్నతాళి క్రాస్‌రోడ్డు, చెవ్వూరు క్రాస్‌రోడ్డు, రణస్థలం టౌన్‌ పోర్షన్‌తో పాటు ఎన్‌హెచ్‌-44పై కియా వద్ద తలపెట్టిన ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు బిడ్లు పిలిచామని అన్నారు. ఎన్‌హెచ్‌-16లో శ్రీ సిటీ జీరో పాయింట్, చిల్లకూరు సెంటర్‌ల వద్ద తలపెట్టిన ఫై ఓవర్ల నిర్మాణాలకు బిడ్లు పిలవాల్సి ఉందని నితిన్‌ గడ్కరి వివరించారు.

భక్తులకు 'దారి' చూపిస్తున్న మల్లన్న - హైదరాబాద్​ - శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్! - Elevated Corridor Srisailam Highway

అపురూపంలా జాతీయ రహదారుల నిర్మాణం- విజయవాడ నగరానికి మణిహారం - National Highways to Vijayawada

వంతెనపై ఐదేళ్లుగా అగచాట్లు - కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో స్థానికుల్లో ఆశలు - Kanuru Flyover Incomplete

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.