ETV Bharat / state

హైదరాబాద్​ నగరం అభివృద్ధిపై కాంగ్రెస్​ దగ్గర ప్రణాళిక లేదు : కిషన్​ రెడ్డి - BJP Basti Bata programme in tg - BJP BASTI BATA PROGRAMME IN TG

BJP Basti Bata Programme in Telangana : గత ప్రభుత్వం హైదరాబాద్​ అంటే కేవలం హైటెక్​ సిటీనే అన్నట్లు వ్యవహరించిందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం దగ్గర భాగ్యనగరం అభివృద్ధికి ప్రణాళిక అంటూ లేదని ఆరోపించారు. సికింద్రాబాద్​ నియోజకవర్గంలో జరిగిన బస్తీబాట కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పాల్గొన్నారు.

BJP Basti Bata Programme in Telangana
BJP Basti Bata Programme in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 9:01 PM IST

Union Minister Kishan Reddy on Hyderabad Development : ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీకి హైదరాబాద్​ నగరంపై ఒక ప్రణాళిక అంటూ లేదని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్​ అంటే హైటెక్​ సిటీనే అన్నట్లు వ్యవహరించిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం బస్తీబాట కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్​ వాసవీ బృందావన్​ గేటెడ్​ కమ్యూనిటీలో కిషన్​ రెడ్డి పర్యటించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఇప్పుడు వాటిని కట్టే పరిస్థితి లేదని ఆరోపించారు. వారి చర్యలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని విమర్శించారు. కనీస అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్​లకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని టెండర్లు ఇవ్వలేకపోతున్నారన్నారు.

తెలంగాణలో అత్యధిక శాతం ప్రజలు హైదరాబాద్​లోనే నివసిస్తుంటారని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. అందుకే ఇక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రాధాన్యతను మార్చుకుంటుందని చెప్పారు. డిఫెన్స్​, ఐటీ, ఫార్మా, హెల్త్​ లాంటి ప్రధానమైన రంగాలకు హైదరాబాద్​ హబ్​గా ఉందని, అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వివరించారు.

ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, మౌలిక వసతులు బ్యాలెన్స్​ చేయాలి : ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్​ నగరంలో పెద్ద ఎత్తున ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు. ఇలా చేస్తేనే అప్పుడు ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయన్నారు. కానీ ఈ ప్రభుత్వం అవేం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. ఈ రెండింటిని బ్యాలెన్స్​ చేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్​ త్వరలో మూడో స్థానానికి వెళ్లనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా అడుగులు వేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సికింద్రాబాద్​ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చేందుకు అనునిత్యం కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు.

'నూతన న్యాయ చట్టాలపై కొందరివి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు' - Kishan Reddy on New Laws

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ తిలోదకాలు - కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి : కిషన్​ రెడ్డి - Kishan Reddy Fires On Congress

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.