Bandi Sanjay slams Congress : తెలంగాణ ప్రభుత్వం మర్చంట్ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం అధిక వడ్డీలు చెల్లిస్తూ, రూ.వేల కోట్ల అప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా రుణాలు తీసుకోవడం లేదని చెప్తారా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
మీ తప్పు కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలా? : బండి సంజయ్ - BANDI SANJAY SLAMS CONGRESS GOVT
కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటై బీజేపీని బద్నాం చేస్తున్నాయని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందన్న భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మూర్ఖంగా వ్యవహరించారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకీ పడుతుందని తెలిపారు.
పదేళ్లలో నిధుల వెల్లువ : కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీయకుండా రాష్ట్ర అభివృద్ది కోసం కలిసి పని చేసుకుంటేనే బావుంటుందని బండి సంజయ్ హితవు పలికారు. కేంద్రం తెలంగాణకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని, పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందన్నారు. వివిధ పథకాల పేరిట మంజూరు చేసిన ఈ నిధుల వివరాలన్నీ ఉన్నాయన్నారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో పాటు రామగుండం ఎరువుల కర్మాగారానికి నిధులు కేటాయించిందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని బండి సంజయ్ సూచించారు. కాళేశ్వరం ఆలయంలోకి డ్రెస్ కోడ్ లేకుండా వెళ్లి పూజలు చేసిన బీఆర్ఎస్ఎల్పీ నేతల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సనాతన ధర్మానికి విరుద్దంగా ఆలయంలోకి వెళ్లడం సరైన చర్య కాదని పేర్కొన్నారు.
మేడిగడ్డ పర్యటన వృథా : శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలంతా నాస్తికులేనని ఆయన వ్యాఖ్యానించారు. సాంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా క్షమాపణలు కోరాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్దకు వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏం సాధించారని ప్రశ్నించిన బండి సంజయ్, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని ఎద్దేవా చేశారు.
"ప్రభుత్వం మర్చంట్ బ్యాంక్‌ల ద్వారా ఎడాపెడా అప్పులు చేస్తోంది. అధిక వడ్డీలు చెల్లిస్తూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకమై బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నారు. విమర్శలు కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి". - బండి సంజయ్ కేంద్రమంత్రి
ఏం సాధించారని సంబురాలు? - రేవంత్ సర్కార్‌పై విపక్షాల ఫైర్ - Bandi Sanjay on Rythu Runa Mafi