Union Minister Bandi Sanjay on Medak Riots : మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడటమే కాకుండా, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ ఘటనలో బాధితులపై అక్రమ కేసులు బనాయించడం కానీ, అమయాకులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను కానీ చేపట్టొద్దని బండి సంజయ్ స్పష్టం చేశారు. మెదక్ ఘటనలో పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయని వెల్లడించారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికీ కొమ్ముకాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బండి సంజయ్ కోరారు.
కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు - Kishan Reddy and Sanjay Took Charge