ETV Bharat / state

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - UGADHI WISHES IN SOME POLITICIANS - UGADHI WISHES IN SOME POLITICIANS

Some Politicians Ugadi Wishes to All Telugu People: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ పలువురు ప్రముఖులు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు. క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నందున అందరికీ మంచి జరగాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Some Politicians Ugadi Wishes to All Telugu People

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 12:48 PM IST

Some Politicians Ugadi Wishes to All Telugu People: తెలుగువారందరికి పలువురు ప్రముఖులు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని కొత్త ఆశలను చిగురింపజేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అభిలషించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నందున అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు మీ ఆగ్రహం ధర్మాగ్రహం కావాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందామని చంద్రబాబు తెలిపారు. ఈ పండుగ ప్రజలకు ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధిని అందించాలని ఆయన కోరుకున్నారు.

ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకం తప్పక చదవండి- దీని విశిష్టత ఏంటో తెలుసా? - Ugadi Pachadi Importance

ఈ జీవితం షడ్రుచుల సంగమం అని మనకు గుర్తు చేసే తెలుగువారి పండుగ ఉగాది అని హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తీపి, చేదు కలిస్తేనే జీవితమని ఆయన పేర్కొన్నారు. తెలుగు వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఆనందోత్సాహాలను పంచేందుకు వచ్చేదే ఈ ఉగాది పండుగని బాలకృష్ణ అన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికి కూడా బాలకృష్ణ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని యువత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు జరగాలని నందమూరి బాలకృష్ణ కోరుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

'క్రోధి' నామ సంవత్సరంలో ప్రపంచమంతా ఉద్రిక్తత- ఆవేశంతో ప్రజలు! పండితుల మాటేంటి?

తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. న‌వ‌ వ‌సంతం అంద‌రికీ ఆయురారోగ్యాలు, స‌క‌ల శుభాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాదికి ఆశావ‌హ ధృక్పథంతో స్వాగ‌తం ప‌లుకుదామని పిలుపునిచ్చారు. క్రోధినామ ఉగాది తెచ్చిన ఉత్తేజంతో రాష్ట్ర ప్రగతికి, ప్రజాసంక్షేమానికి పాటుప‌డ‌దామన్నారు.

క్రోధి నామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్​ అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో మరింత ప్రోత్సాహం లభించాలని ఆయన కోరుకున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. క్రోధి నామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని పవన్‌ పేర్కొన్నారు.

ఉగాది పండుగ వెనుక ఉన్న పురాణ గాథ తెలుసా? ఈ పర్వదినానికి ఉన్న విశిష్టత ఏంటి? - ugadi festival importance

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.