ETV Bharat / state

హైదరాబాద్​లో అమానుషం - కాగితాలు ఏరుకునే మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం - 45 Yrs OLD WOMAN RAPE IN KUKATPALLY - 45 YRS OLD WOMAN RAPE IN KUKATPALLY

Woman Raped in Hyderabad : రోడ్డుపై చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే మహిళ ఇద్దరు యువకుల కంటపడింది. ఆమెపై పాశవికంగా లైంగిక దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు ఈ కీచకులు. ఫలితంగా అధిక రక్తస్రావంతో ఆ మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

2 Young Boys Raped 45 Woman
45 Old Woman Body Found in Kukatpally
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 10:20 AM IST

Updated : Apr 22, 2024, 10:46 AM IST

Two Youth Rapes A Woman in Hyderabad : ఈ మధ్యకాలంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్లయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తిరగబడితే వారిని హత్య చేసి మృతదేహాలను గుర్తుపట్టే వీల్లేకుండా చేసేస్తున్నారు. ఇలాంటి కామాంధులను శిక్షించడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా ఈ ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్​ కూకట్​పల్లిలో కాగితాలు ఏరుకునే మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు.

రోడ్డుపై చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే మహిళ తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. అమ్మ వయస్సుదనే కనికరం కూడా లేకుండా మానవత్వం మరచిన ఆ ఇద్దరు యువకులు ఆమెపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫలితంగా అధిక రక్తస్రావంతో ఆ అభాగ్యురాలు అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : హైదరాబాద్​ మూసాపేట వై జంక్షన్​ సమీపంలోని (బాలానగర్​ నుంచి కూకట్​పల్లి రోడ్డు) విష్ణుప్రియ లాడ్జి పక్కనున్న భవనంలో వ్యాపారా సముదాయాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఓ భవనం సెల్లార్​లో ఒక షట్టర్​ ముందు గుర్తు తెలియని మహిళ (45) మృతదేహాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మైనర్​ బాలికపై అత్యాచారం చేసిన సీఐ - అదుపులోకి తీసుకున్న పోలీసులు - POCSO Case Filed On CI

ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతురాలి ఒంటిపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు తీవ్రస్థాయిలో రక్తస్రావమైనట్లు ఆనవాళ్లు గురించారు. మృతదేహం పక్కన ఉన్న ఓ సంచిలో దొరికిన చీటిపై ఓ పేరు రాసి ఉంది. రాసి ఉన్న పేరు ఆమెదే కావొచ్చని భావిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించగా, పాతికేళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఈ ఘటన జరగక ముందుకు అదే ప్రదేశంలో పక్కన ఉన్న గల్లీలో కొద్దిసేపు ఆ మహిళతో మాట్లాడారు. తర్వాత ఆమెను బలవంతంగా సెల్లార్​లోని షట్టర్​ వద్దకు లాక్కెళ్లారు.

బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు : కొంతసేపటి తర్వాత ఆ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై హడావుడిగా కూకట్​పల్లి వైపు పారిపోయినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. వేలిముద్రల నిపుణులు, జాగిలాల బృందం సభ్యులు ఘటనాస్థలిని పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు. మహిళ మృతదేహాన్ని హస్పిటల్​కు తరలించి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు.

కూతురిపై కన్నతండ్రి అత్యాచారం - తప్పించుకునే క్రమంలో మరో డేంజర్​లోకి

స్నేహితులతో కలిసి సోదరిపై అత్యాచారం- ఆపై కిరాతకంగా హత్య- ఆ విషయంలో నిలదీసినందుకే!

Last Updated : Apr 22, 2024, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.