Two Telangana Students Died In America : విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులను మొదట ఆకర్షించే దేశం అమెరికా. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అక్కడ చదువుకుని స్థిరపడాలనుకుంటారు. వారిలో తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి స్థిరపడాలని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మరీ అమెరికాకు పంపిస్తున్నారు. విద్య పూర్తిచేసుకుని తిరిగొస్తారని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు తమ పిల్లలు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, హత్యలకు గురవుతున్నారనే వార్తలు తీరని వేదనను మిగులుస్తున్నాయి.
తాజాగా అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం వీరి కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నివేశ్, గౌతమ్ కుమార్ అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేశ్(20), జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమల్‌కుమార్, పద్మ దంపతుల కుమారుడు గౌతమ్‌కుమార్(19) అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి : ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేశ్, గౌతమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ మేరకు అక్కడి పోలీసులు మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గౌతమ్ కుమార్ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేశ్ మృతదేహాన్ని హుజురాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Telangana student died in America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబ్‌నగర్ విద్యార్థి దుర్మరణం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి