Two Sibling Dies After Falling Into Water Sump in Warangal : తెల్లారితే మేడారం జాతరకు వెళ్లేవారు. అమ్మల సన్నిధిలో బిడ్డలతో మురిసిపోయేవారు. కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించాలి అనుకున్నారు. ఇంతలోనే ఆ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను నీటి సంపు కబళించింది. అప్పటి దాకా సంతోషాలతో నిండిన ఆ ఇల్లు, ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. నీటి సంపులో పడి చిన్నారులు మృత్యువాత పడిన ఘటన వరంగల్ జిల్లా బాలాజీనగర్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
సీఐ పుల్యాల కిషన్, ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, వికారాబాద్ జిల్లా దోగరమామిడి గ్రామానికి చెందిన కరణం రవి కుమార్, ఎనుమాముల బాలాజీనగర్‌కు చెందిన బాలేశ్వరీ 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు ప్రేమకు గుర్తుగా పండంటి బిడ్డలు శౌర్య తేజ(4), తేజస్విని(2) ఉన్నారు. దంపతులిద్దరూ మేడారం జాతర వెళ్లాలి అనుకుని శుక్రవారం రాత్రి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు వచ్చారు. రాత్రి 8:30 గంటలకు బాలేశ్వరీ పుట్టినిల్లు ఎనుమాముల బాలాజీనగర్‌కు చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయం జాతరకు వెళ్దామని నిర్ణయించుకున్నారు.
గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Two Sibling Dies After Falling Into Water Sump : అల్లుడు రవి కుమార్‌తో మామ శ్రీనివాస్ మాట్లాడుతున్న సమయంలో పిల్లలు ఇద్దరు శౌర్యతేజ, తేజస్విని సెల్‌ఫోన్ చూస్తూ ఆడుకుంటున్నారు. పిల్లలు పక్కనే ఆడుకుంటున్నారని భావించిన తల్లి బాలేశ్వరీ, విశ్రాంతి తీసుకుంది. అప్పటి వరకు సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్న పిల్లలిద్దరు కొద్దిసేపటికి కనిపించకపోయేసరికి తల్లి బాలేశ్వరీ, తాత శ్రీనివాస్ ఇంటి చుట్టుపక్కల అంతా వెతికారు. విషయం తెలిసి సమీప బంధువు ఒకరు శ్రీనివాస్ ఇంటికి చేరుకుని పిల్లలను వెతకడంలో నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలో ఆయన దృష్టి నీటి సంపుపై పడింది. ఆరున్నర అడుగుల లోతున్న నీటిసంపులో వెతకడంతో చిన్నారి తేజస్విని నీళ్లలో తేలుతూ కనిపించింది. పాపను బయటికి తీసి తర్వాత నీళ్లలో దిగడంతో బాబు శౌర్యతేజ సైతం కనిపించాడు. అప్పటికే రాత్రి 11 గంటలు దాటింది. చిన్నారులిద్దరినీ హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిని పరీక్షించిన వైద్యులు పిల్లలిద్దరూ అప్పటికే చనిపోయారని ధ్రువీకరించారు. శనివారం మధ్యాహ్నం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. సమ్మక్క-సారలమ్మ మా పిల్లలిద్దరినీ మీ దగ్గరికే తీసుకెళ్లారా! అంటూ ఆ కన్నవాళ్లు రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
ఓవెన్లో చిన్నారిని పడుకోబెట్టిన తల్లి- కాలిన గాయాలతో మృతి- కారణం తెలుసుకుని పోలీసులు షాక్
శ్రీనివాస్-రమ దంపతులు కుమారుడితో కలిసి మేడారం జాతరలో హోటల్ నిర్వహిస్తున్నారు. అల్లుడు, పిల్లల్ని తీసుకొని సోమవారం మేడారం రావాలని తల్లిదండ్రులు ఇటీవల బాలేశ్వరీకి ఫోల్ చేసి చెప్పారు. కానీ ముందుగానే వస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో మరో రెండు రోజులు పిల్లలతో సరదాగా గడపొచ్చని అనుకున్నారు శ్రీనివాస్-రమ. తాము ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచినట్లు పిల్లలు అర్ధాంతరంగా చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
'మంత్రించి తెచ్చిన నిమ్మకాయే ఊపిరి తీసింది' - కంటతడి పెట్టిస్తున్న ఘటన