ETV Bharat / state

కలరా వ్యాధికి దారితీసిన కలుషిత నీరు - గుంటూరులో ఇద్దరికి సోకిన వ్యాధి

Two People Infected with Cholera in Guntur District: గుంటూరు నగరంలో కలరా వ్యాధి కలవరపెడుతోంది. కనుమరుగైపోయిందనుకున్న కలరా ఇప్పుడు కలుషిత జలాల కారణంగా వెలుగుజూసింది. విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ బయటకు పొక్కనీయలేదు. ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలవుతున్నా కొందరు మరణించినా అందుకు కారణాల్ని ఇప్పటికీ వెల్లడించకపోవటం అనుమానాలకు తావిస్తోంది.

cholera_in_guntur.
cholera_in_guntur.
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 7:08 AM IST

కలరా వ్యాధికి దారితీసిన కలుషిత నీరు - గుంటూరులో ఇద్దరికి సోకిన వ్యాధి

Two People Infected with Cholera in Guntur District: గుంటూరు నగరపాలక సంస్థ ప్రజల ప్రాణాలతో చెలాగాటమాడింది. పదిలక్షల జనాభా కలిగిన నగరవాసులకు తాగునీరు (Drinking water problem in Guntur) అందించే విషయంలో నిర్లక్ష్యం వహించింది. పర్యవసానంగా కలుషిత జలాలు కాటేసి నలుగురు చనిపోగా వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. మురుగు నీటి కాల్వల్లో తాగునీటి పైపులైన్లు ఉన్నా పట్టించుకునే వారు లేరు. పైపులకు లీకులు ఏర్పడిన చోట మురుగునీరు చేరి ప్రవహించటంతో కలుషిత జలాలకు దారితీసింది. ఆ విషయం గ్రహించని అమాయక ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు.

'గుంటూరు మరణాల'పై వాస్తవాలు ముందుంచండి - న్యాయసేవాధికార సంస్థను ఆదేశించిన హైకోర్టు

నమూన పరీక్షలపై గోప్యత: బాధితుల నుంచి వారు తాగిన నీళ్లు, తీసుకున్న ఆహార పదార్థాల నమూనాలను పెద్ద సంఖ్యలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలు చేయించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఏ ఒక్క ఫలితాన్ని బయటపెట్టకుండా గోప్యత పాటించారు. అయితే అనారోగ్యంతో జీజీహెచ్​లో చేరిన ఇద్దరికి కలరా నిర్ధారణ అయిందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖవర్గాలు ఆలస్యంగా ధ్రువీకరించాయి. వీరిలో 70ఏళ్ల మహిళ, 37ఏళ్ల యువకుడు ఉన్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ జనవరి నెలలో వారు జీజీహెచ్​లో చేరారు. వీరికి గంజినీళ్లు మాదిరిగా విరేచనాలు నిరాటంకంగా అవుతుండటంతో అనుమానించి వారి నమూనాలను కలరా టెస్ట్​ కోసం పంపారు.

గుంటూరులో రోజురోజుకీ పెరుగుతున్న డయేరియా బాధితులు- మృతుల సంఖ్యపెరగడంపై ఆందోళన!

గుంటూరు వైద్య కశాశాల మైక్రోబయాలజీ విభాగం ఆచార్యులు పరీక్ష చేసి ఆ ఇద్దరిలో కలరా ఉన్నట్లు నిర్ధరించి నివేదిక ఇచ్చారు. వారిద్దరికి హై యాంటీబయాటిక్‌ మందులు వాడి ఆరోగ్యం కుదుటపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారిలో ఒకరికి కోలుకోవటానికి 20 రోజులు పట్టింది. కలరా నిర్ధరణ కాగానే ఆ ఇద్దరు కుటుంబీకులకు, ఇరుగుపొరుగుకు పెద్దసంఖ్యలో ఇంకా ఎవరికైనా కలరా లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో పరీక్షలు చేశారు.

గుంటూరులో ప్రాణాలు తోడేస్తున్న కలుషిత జలం - మొక్కుబడిగా నీటి పరీక్షలు!

నీటిని తాగాలంటే భయపడుతున్న ప్రజలు: వాంతులు, విరేచనాలు చేసుకుని అనారోగ్యం పాలైన వారిలో సగానికి పైగా బాధితులు నగరంలో శారదాకాలనీ, శ్రీనగర్‌లోనే ఉన్నారు. ఆ ప్రాంతాల్లో తాగునీటి పైపులు శిథిలావస్థలో ఉండటం వాటి నిర్వహణను నగరపాలక విస్మరించటంతో పైపులకు లీకులు ఎక్కడ ఏర్పడ్డాయో ఎక్కడ పగుళ్లు వచ్చాయో తెలియకుండా పోయింది. ప్రజలు, విపక్షాల నుంచి నీళ్ల విషయమై ఫిర్యాదులు అందగానే నగరపాలక సంస్థ స్పందించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి ఉంటే ఇంతమంది జనాలు అనారోగ్యం పాలయ్యేవారు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. తీవ్ర అతిసార లక్షణాలతో జీజీహెచ్​లో చేరిన కొందరిలో వాంతులు, విరేచనాల రూపంలో నీళ్లు బయటకు పోయి కిడ్నీలపై ప్రభావం చూపింది. కిడ్నీలు పాడవకుండా కొందరికి డయాలసిస్‌ చేసి ప్రాణాలు కాపాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.