ETV Bharat / state

విశాఖలో తుపాకుల కలకలం - ఒకరు అరెస్ట్​ - police Seized two Illegal guns - POLICE SEIZED TWO ILLEGAL GUNS

Two Illegal Guns Seized by Visakha Police: విశాఖలో ప్రస్తుతం ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు అంతు చిక్కడంలేదు. ఓ వైపు తుపాకులు, ఈ- సిగరెట్లు మరో వైపు మాధక ద్రవ్యాలు నగరంలో ఇలాంటి సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా లైసెన్స్‌ లేని ఒక రివాల్వర్, పిస్తోలు, రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో నిషేధిత ఈ- సిగరెట్లను టాస్క్​ఫోర్స్​ సిబ్బంది పట్టుకున్నారు

Two Illegal Guns Seized by Visakha Police

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 9:07 AM IST

విశాఖ ప్రజలకు మరో షాక్​- తుపాకులు, ఈ- సిగరెట్లు కలకలం

Two Illegal Guns Seized by Visakha Police: ఎన్నికల వేళ విశాఖలో లైసెన్స్‌ లేని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. గత ఏడాది మార్చి 15న విశాఖ శ్రీకృష్ణా ట్రావెల్స్‌ ఆఫీస్‌ వద్ద ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన కునాల్‌ అనే వ్యక్తి విశాఖ నుంచి బెంగళూరు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. మద్యం మత్తులో అనుమానాస్పందగా తిరుగుతుండటంతో ట్రావెల్స్‌ సిబ్బంది శివనాగరాజు ప్రశ్నించారు. అతని దగ్గర ఉన్న బ్యాగును తనిఖీ చేస్తుండగా కునాల్​ తడబడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమయంలో బ్యాగు నుంచి ఒక ప్యాకెట్‌ కింద పడగా అందులో ఒక రివాల్వర్, పిస్తోలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. శివనాగరాజు వాటిని ట్రావెల్‌ కార్యాలయంలో భద్రపరిచి వాటితో ఫొటోలు దిగారు. అతని వద్ద ఈ ఆయుధాలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేసి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలో 728 తుపాకులు స్వాధీనం- ఎన్నికల ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు: సీపీ

ఈ ఆయుధాలు వదిలి పారిపోయిన కునాల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రివాల్వర్‌ ఇంగ్లండ్‌లో తయారైనట్లు పోలీసులు వెల్లడించారు. పిస్తోలుపై రెండు డాల్ఫిన్‌ ముద్రలు ఉన్నట్లు గుర్తించామన్నారు. శివనాగరాజు ఏడాదిగా తన వద్ద ఉంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. శివనాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగర పరిధిలో 783 మందికి ఆయుధాల లైసెన్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాగానే వాటిని ఆయా స్టేషన్లలో తీసుకున్నామని తెలిపారు.

ఎన్నికల వేళ పోలీసుల ప్రత్యేక నిఘా - ఒక్క జిల్లాలోనే రూ. 4.5 కోట్లు సీజ్

E- Cigarettes Was Seized by Police: నగరంలో నిషేధిత ఈ- సిగరెట్లను సీజ్ చేసినట్లు జాయింట్ సీపీ ఫకిరప్ప తెలిపారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం ఓ కళాశాలలో విద్యార్థుల వద్ద ఈ- సిగరెట్లు ఉన్నట్లు సమాచారం తెలిసిందన్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు (Task Force Police) దాడి చేసి వివరాలు సేకరించగా నగరంలోని మీరా కలెక్షన్స్‌, డెజావు రెడీమేడ్‌ దుకాణాల్లో వీటిని విక్రయిస్తున్నట్లు తెలిసిందని ఆయన అన్నారు. వారి వద్ద వివిధ బ్రాండ్‌లకు చెందిన మొత్తం 723 ఈ- సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ. 25లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. వీటిలో విదేశీ సంస్థలకు చెందిన ఈ- సిగరెట్లు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయగా ముంబై నుంచి ఈ సిగరెట్లు ఇక్కడికి వచ్చినట్టు తెలిసిందన్నారు. వీటిని ముంబయికి చెందిన అశోక్‌ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ముంబయి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నందున నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

విశాఖకు కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే - సీబీఐ నివేదికలో వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.