ETV Bharat / state

ఏడో తరగతిలోనే సొంతంగా ఏఐ కంపెనీలు పెట్టి - అందరి చేత ఔరా అనిపిస్తున్న కవలలు - AI for good Global Summit

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 11:35 AM IST

AI Global Summit in Hyderabad : వారిద్దరూ కవలలు. వయసు 14 ఏళ్లు. అయితేనేం వారి ఆలోచనలు మాత్రం చాలా జోరు. అందుకే ఏడో తరగతిలోనే సొంతంగా చేరో​ కంపెనీ పెట్టి ఔరా అనిపిస్తున్నారు. వీరు పెరిగింది అమెరికా అయినా, పుట్టింది మాత్రం హైదరాబాద్​లోనే. ప్రస్తుతం హైదరాబాద్​ వేదికగా జరుగుతున్న ఏఐ గ్లోబల్​ సమ్మిట్​లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

AI Global Summit in Hyderabad
AI Global Summit in Hyderabad (ETV Bharat)

Twins Participate AI Global Summit : సాధారణంగా 14 ఏళ్ల వయసు అంటే స్కూల్​కెళ్లి చదువుకుని, ఇంటికి రాగానే వచ్చి స్నేహితులతో ఆడుకుంటాము. లేకపోతే టీవీ చూస్తూ హోమ్ వర్క్ చేసుకొని హాయిగా నిద్రపోతాం. కానీ ఈ ఇద్దరు కవలలు మాత్రం సొంతంగా రెండు కంపెనీలు ఏర్పాటు చేసి అందరి చేతా ఔరా అనిపించుకుంటున్నారు. వారి వయసుకు మించిన ఆలోచనల జోరుతో ముందుకు సాగుతున్నారు. వీరు పుట్టింది హైదరాబాద్​లోని రామంతాపూర్​లో అయినా, ఇప్పుడు పెరుగుతుంది మాత్రం అమెరికాలో.

ఇంత వయసులోనే కృత్రిమ మేధ (ఏఐ)లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. వారే సిద్ధార్థ్​ నంద్యాల, సౌమ్య నంద్యాల. గురువారం నుంచి హైదరాబాద్​లో జరుగుతున్న గ్లోబల్​ ఏఐ సదస్సులో అమెరికా నుంచి వచ్చి పాల్గొన్నారు. వీరి ఆలోచనలు చూసి గ్లోబల్​ సమ్మిట్​​కు వచ్చిన వారు సైతం అవాక్కవుతున్నారు.

ప్రపంచంలోనే చిన్నవయసులో ఏఐ సర్టిఫైడ్‌ : కవలల్లో ఒకరైనా సిద్ధార్థ్​కు ఏడేళ్ల వయసులోనే కోడింగ్​పై ఆసక్తి పెరిగింది. సామాజిక మాధ్యమాల్లోని లింక్డిన్​ లెర్నింగ్​, యూట్యూబ్​లో చూసి సీ, సీ++, పైథాన్​ లాంగ్వేజెస్​ నేర్చుకున్నాడు. ఒరాకిల్​, ఆర్మ్​ నుంచి మిషిన్​ లెర్నింగ్​, ఏఐపై ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అతిచిన్న వయసులో ఏఐ సర్టిఫైడ్​ అయ్యాడు. ఈ క్రమంలోనే ఏడో తరగతిలోనే డల్లాస్​ సమీపంలోని ప్రిస్కో నగరంలో స్టెమ్​ ఐటీ కంపెనీని స్థాపించాడు. పలు ఏఐ ఆధారిత ఉత్పత్తులను స్వయంగా ఆల్గరిథమ్​లు రాస్తూ రూపొందించాడు. అందులోనే వృద్ధుల కోసం చేసిన ఫాల్​ డిటెక్షన్​ బ్యాండ్​, ఏఐతో పనిచేసే ప్రోస్థటిక్​ హ్యాండ్​ ప్రాచుర్యం పొందాయి.

ఏఐ ప్రోస్థటిక్​ హ్యాండ్​ : చేతులు లేనివారికి అమర్చేందుకు తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందించాడు. దీన్ని ఏఐ సదస్సులో ప్రదర్శించనున్నాడు. అనంతరం వివరించనున్నాడు.

ఫాల్​ డిటెక్షన్​ బ్యాండ్​ : వృద్ధులు ఇంట్లో పొరపాటున జారిపడిపోతే వారి కుటుంబ సభ్యులకు ఇది అలర్ట్​ ఇస్తుంది. హైదరాబాద్​లోని టీవర్క్స్​తో కలిసి పని చేయనున్నాడు.

మిషిన్​ లెర్నింగ్​ ఆల్గరిథమ్ : డయాబెటిక్​ రెటీనోపతిని గుర్తించేందుకు మిషిన్​ లెర్నింగ్​ ఏఐ ఆల్గరిథమ్​లు తయారు చేశాడు. ఎల్వీ ప్రసాద్​ కంటి ఆసుపత్రిలో దీన్ని ఉపయోగించేలా చర్యలు సాగుతున్నాయి. గత నెలలో సీఎం రేవంత్​ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు డల్లాస్​ వెళ్లినప్పుడు వారిని సిద్ధార్థ్​ కలిశాడు.

డ్రైవ్‌ఇట్‌ అంటున్న సౌమ్య : సిద్ధార్థ్​ కంటే 20 నిమిషాలు ముందు పుట్టిన సౌమ్య నంద్యాల అమెరికాలో డ్రైవింగ్​ లైసెన్స్​ రెన్యువల్​కు 6 నుంచి 8 నెలలు సమయం పడుతుందని తెలుసుకుంది. దీని సమయాన్ని తగ్గించాలని ఆలోచించి డ్రైవ్​ఇట్​ అనే సంస్థను మొదలుపెట్టింది. ఈ ప్లాట్​ఫాం ద్వారా లైసెన్స్​కు దరఖాస్తు చేసుకుంటే నెల లేదా వారం రోజుల్లోనే అపాయింట్​మెంట్లు లభిస్తాయి. ఇప్పటివరకు 10 వేల మంది దీన్ని వినియోగించుకున్నారు. సౌమ్య కూడా ఏఐలో ప్రావీణ్యం పొందింది.

హైదరాబాద్ వేదికగా ఏఐ సదస్సు - అందరికీ అందుబాటులోకి 'AI' నినాదంతో గ్లోబల్‌ సమ్మిట్‌ - AI Global Summit in Hyderabad

AIకి భయపడుతున్న వైల్డ్​ యానిమల్స్​! గ్రామాల్లో వన్యప్రాణుల సంచారానికి వినూత్న రీతిలో చెక్! - AI For Animal Warning

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.