Tumor in Four Month Old Baby Stomach Doctors Performed Surgery Successfully : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నాలుగు నెలల పసికందుకి అరుదైన శస్త్రచికిత్స చేసి కాపాడారు. కడుపులో ఏర్పడిన కణితిని 4 గంటల పాటు శ్రమించి తొలగించారు. 5 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని వైద్యులు వెల్లడించారు. అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ పరీక్షలు చేసి కడుపులో కణితి తొలగించామని వైద్యులు తెలిపారు.
కృష్ణా జిల్లా బంటుమల్లి గ్రామానికి చెందిన గడ్డం శోభన్ బాబు, సుప్రియ భార్యభర్తలు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి 27వ తేదీన సుప్రియ బాబుకు జన్మనిచ్చి అనారోగ్యంతో మృతి చెందింది. ఆ పసివాడికి సైతం ఫిట్స్ రావడంతో వైద్యులు చికిత్స అందించి కాపాడారు. ఆ తర్వాత చిన్నారికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. చిన్నారి కడుపులో కణితి ఉందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దానికోసం రూ 25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
ఆర్ధిక స్థోమత లేని శోభన్ బాబు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారని తెలిసి బాబును జీజీహెచ్‌కు తీసుకుని వచ్చారు. సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఈ చిన్నారికి చికిత్స అందించే బాధ్యతలను పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ భాస్కరరావుకు అప్పగించారు. వారు అల్ట్రా సౌండ్ సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించి కడుపు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. చిన్నారి కోలుకుంటున్నాడని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, డాక్టర్ భాస్కర్ తెలిపారు. తన బిడ్డ ప్రాణాలను కాపాడిన వైద్యులకు తండ్రి శోభన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
'వారం రోజుల క్రితం శోభన్ బాబు తన నాలుగు నెలల కొడకు కడుపులో గడ్డ ఉందని ఆస్పత్రికి వచ్చారు. బాబు పరిస్థితి చూస్తే కడుపులో పిండం ఉంది, అది గడ్డలా మారి రక్తనాళాల దగ్గర ఉండి బాలుడిని ఇబ్బంది పెట్టింది. ఇది ఎమ్మారై స్కానింగ్ ద్వారా సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాత పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.' - కిరణ్ కుమార్ జీజీహెచ్ సూపరింటెండెంట్
8 KG Tumor Removed : మహిళ గర్భాశయంలో 8 కేజీల కణతి.. వైద్యుల అరుదైన సర్జరీ.. చివరకు ఏమైందంటే?
తోకతో జన్మించిన బాలుడు - శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు - Boy Born With Tail