ETV Bharat / state

తెలంగాణ ఆర్టీసీ ఆధ్యాత్మిక బాట - ఈ పంచారామ క్షేత్రాలను ఫ్రీగా చూసొద్దాం పదండి - TSRTC TO ARRANGE SPECIAL BUSES

కార్తిక మాసం అంటేనే శివ నామస్మరణతో మార్మోగే శైవక్షేత్రాలు - అలాంటి భక్తుల కోసం బస్సులను నడుపుతున్న టీజీఎస్​ఆర్టీసీ

TSRTC TO ARRANGE SPECIAL BUSES
RTC Karthika Masam Special Buses (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 10:09 AM IST

RTC Karthika Masam Special Buses : కార్తిక మాసం అంటేనే శివ నామస్మరణతో మార్మోగే శైవక్షేత్రాలు గుర్తుకొస్తాయి. పవిత్ర మాసంగా భావించే ఈ నెల రోజలు భక్తులు ఉపవాస దీక్షలు, తీర్థ యాత్రలు చేస్తుంటారు. ప్రసిద్ధ ఆలయాలు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ డిపోల నుంచి సర్వీసులు నడిపించేందుకు ఆర్టీసీ సిద్దమైంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పంచారామాలు, తమిళనాడులోని అరుణాచలం, కేరళలోని శబరిమల క్షేత్రాలకు బస్సులు నడపనున్నట్లు తెలిపింది. మరోవైపు 40 మంది భక్తులు కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శన కోసం బస్సు కావాలన్నా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

మాలధారణ స్వాముల కోసం శబరిమలకు : ప్రతీ సంవత్సరం కార్తిక మాసంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వేల మంది భక్తులు అయ్యప్ప మాలధారణ వేసుకుంటారు. వీరి కోసం శబరిమల వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. 40 మంది స్వాములు కలిసి బుక్‌ చేసుకుంటే బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ బస్సులో ఒక గురుస్వామి, ఒక కన్నె స్వామికి, ఒక వంట మనిషికి, స్వాముల సామగ్రిని సర్దేందుకు మరొకరికి ఉచిత ప్రయాణం కల్పిస్తారు. ఈ యాత్ర వివరాల కోసం డిపో మేనేజర్‌ 9959226047 నెంబరులో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

అరుణాచలం యాత్ర : తమిళనాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరనుంది. మార్గం మధ్యలో మొదట కాణిపాకం చేరుకుంటుంది. ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడి దర్శనం అనంతరం అరుణాచలం చేరుకొని గిరి ప్రదక్షిణ చేస్తారు. అనంతరం తిరుగు ప్రయాణంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం, బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకొని ఆ తర్వాత హనుమకొండకు చేరుకునేలా యాత్రను నిర్ణయించారు. ఈ యాత్రకు వెళ్లేవారికి రూ.4500, పిల్లలకు రూ.3000గా టికెట్టు ధర నిర్ణయించారు. వివరాలకు 98663 73825 నెంబరులో సంప్రదించాలని సూచించారు.

ప్రయాణం ఇలా : ద్రాక్షారామం (భీమేశ్వరస్వామి), సామర్లకోట (భీమలింగేశ్వర స్వామి), అమరావతి (అమర లింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరస్వామి), పాలకొల్లు (క్షీర లింగేశ్వరస్వామి), క్షేత్రాలకు ఈ నెల 10, 17, 24 తేదీల్లో అంటే ప్రతి ఆదివారం హనుమకొండ బస్టాండు నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

"ఒకే రోజు పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే మంచి ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ మేరకు ఆ ఐదు క్షేత్రాలను ఒకేరోజు దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ యాత్రకు పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1200గా టికెట్టు ధర నిర్ణయించారు. భక్తుల కోరిక మేరకు మొట్టమొదటిసారిగా పంచారామ క్షేత్రాలకు బస్సులు నడిపించేందుకు ఏర్పాటు చేశాం. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం ద్వారా సురక్షితంగా యాత్రకు వెళ్లివచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలి." -వంగల మోహన్‌రావు, వరంగల్‌2 డిపో మేనేజర్‌

పరమ పవిత్ర కార్తిక మాసంలో పుణ్యస్నానాలు - ఇవి పాటిస్తే సకల పాపాలు విముక్తి!

గౌరీ వ్రతం నుంచి ఛత్‌ పూజ వరకు - కార్తీక మాసంలోని ముఖ్యమైన పండుగలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.