ETV Bharat / state

మధ్యాహ్నం రోడ్డెక్కుతున్నారా? - అవస్థలు ఖాయం! - adjustment of buses in hyderabad - ADJUSTMENT OF BUSES IN HYDERABAD

Tsrtc Hyderabad Latest News : హైదరాబాద్‌ నగర వాసులకు ఆర్టీసీ ఒక కీలక విషయం తెలియజేసింది. దీని ప్రకారం.. మధ్యాహ్నం వేళ జనం రోడ్డెక్కితే అవస్థలు తప్పవు! మరి.. ఆ విషయం ఏంటో మీకు తెలుసా?

Tsrtc Hyderabad Latest News
Tsrtc Hyderabad Latest News
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 11:24 AM IST

Tsrtc Hyderabad Latest News : రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఉదయం 10 గంటలు కాకముందు నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో.. ప్రజలు బయటకు రావాలంటేనే ఎంతో భయపడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అలాగే రాత్రి వేళల్లో సైతం వేడి ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరానికి సంబంధించి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజులు కూడా ఎండలు దంచికొడతాయని హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో వేడిగాలుల తీవ్రత కారణంగా ప్రయాణికుల రాకపోకలు తగ్గాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌ఆర్టీసీ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే.. సిటీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య బస్సు ట్రిప్‌లను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

నగరంలో పగటి వేళలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉండటం వల్ల ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉందని.. కాబట్టి ఈ సమయంలో బస్సు ట్రిప్‌లను తగ్గించనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. అలాగే.. నగరంలోని అన్ని రూట్లలో కూడా ఉదయం 5 గంటల నుంచి బస్సులు యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొంది. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా బస్సు సర్వీస్‌లు యథావిధిగానే ఉంటాయని చెప్పింది. కాబట్టి, ప్రయాణికులు మార్పులను గమనించి టీఎస్‌ఆర్టీసీకి సహకరించాలని కోరింది.

Temperatures in Telangana : ఈ ఎండలకు కాసేపు బయటకు వెళ్తేనే.. జనం నీరసించి పోతున్నారు. ఎండవేడి కారణంగా తరచూ బాడీ డీహైడ్రేషన్​కు గురవుతుంటుంది. ఇటు ఆర్టీసీ కూడా బస్సులు తగ్గించడంతో.. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి.. బయటకు వెళ్లాల్సి వస్తే.. 11 నుంచి 12 గంటల లోపు ఇంటికి చేరుకునేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే.. వడదెబ్బ కూడా తగిలే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

వానాకాలంలో వరి పంటవైపే అన్నదాతల మొగ్గు - 65 లక్షల ఎకరాల్లో సాగు అంచనా! - PADDY CULTIVATION IN TELANGANA 2024

గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీ అసెస్‌మెంట్లలో భారీగా అక్రమాలు - పునః పరిశీలనకు వాణిజ్య పన్నుల శాఖ శ్రీకారం - GST Assessments in Telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.