ETV Bharat / state

టీఎస్ లాసెట్, ఈసెట్2024 షెడ్యూల్​ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే - టీఎస్ లాసెట్ 2024 నోటిఫికేషన్​

TS LAWCET 2024 Notification : తెలంగాణ ఉన్నత విద్యామండలి2024-25 విద్యా సంవత్సరానికి గానూ లాసెట్​ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మూడేళ్ల, అయిదేళ్ల లా కామన్​ ఎంట్రెన్స్ టెస్ట్(TS LAWCET- 2024)​, పీజీ లా కామన్​ ఎంట్రెన్స్ టెస్ట్ సెట్​ (TS PGLCET- 2024) ప్రవేశపరీక్షలకు షెడ్యూల్​ను ఖారరు చేసింది. మరోవైపు ఈ నెల 14న ఈసెట్(TS ECET-2024) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

TS ECET 2024 Notification
TS LAWCET 2024 Notification Released
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 7:04 PM IST

TS LAWCET 2024 Notification Released : లా విద్యను అభ్యసించాలనుకునే వారికోసం శుభవార్త. ఏటా ఉన్నత విద్యామండలి నిర్వహించే న్యాయవిద్య(TS LAWCET- 2024) నోటిఫికేషన్​కు షెడ్యూల్ విడుదలైంది. ఎల్​ఎల్​బీ, ఎల్​ఎల్​ఎం పరీక్ష నిర్వహణకు ఈ నెల 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొంది. జూన్ 3వ తేదీన టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది.

టీఎస్ లాసెట్2024 నోటిఫికేషన్​ విడుదల : ఫిబ్రవరి 28న

దరఖాస్తుల స్వీకరణ : మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు

పరీక్ష తేదీ : జూన్ 3న

గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు

TS ECET 2024 Notification : మరోవైపు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈసెట్ షెడ్యూల్​ను విడుదల చేసింది. ఈ నెల 14న ఈసెట్(TS ECET-2024) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు విద్యార్థులు ఈసెట్​కి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చునని స్ఫష్టం చేసింది. రూ.500ల లేట్ ఫీజుతో ఏప్రిల్ 22 వరకు, 1000 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28 వరకు ఆన్​లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు స్ఫష్టం చేసింది. మే 1 నుంచి విద్యార్థులు హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చని స్ఫష్టం చేసింది. మే 6వ తేదీన ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 14

దరఖాస్తుల స్వీకరణ : ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు

పరీక్ష తేదీ : మే 6న

TS Eamcet Renamed as EAPCET : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరును మారుస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ స్థానంలో టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీగా మారుస్తున్నట్టు స్పష్టం చేసింది.

టీఎస్ ఈఏపీసెట్​ను(TS EAPCET) మే 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. జేఎన్​టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజుల పాటు టీఎస్ ఈఏపీసెట్ జరుగుతుందని పేర్కొంది. మే 6న ఈసెట్, మే 23న టీఎస్ ఎడ్​సెట్, జూన్ 3న లాసెట్, పీజీఎల్ సెట్​లు, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఎంటెక్, ఎంఫార్మ్ కోర్సుల్లో చేరే వారి కోసం జూన్ ఆరు నుంచి 8 వరకు పీజీ ఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు టీఎస్ పీఈసెట్ జరుగుతుందని స్పష్టం చేసింది.

తెలంగాణ గురుకుల ఉద్యోగ ఫలితాలు వెల్లడి - 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా విడుదల

గతంలో నిర్వహించిన గ్రూప్​-1 రద్దు - అదనంగా మరో 60 ఖాళీలతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ : సీఎం రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.