ETV Bharat / state

తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ - సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్రకు - TELANGANA NEW GOVERNOR JISHNU DEV

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 6:49 AM IST

Telangana New Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ(66) నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. త్రిపురకు చెందిన ఈయన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్ వర్మ 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

Jishnu Dev Varma
Jishnu Dev Varma (ETV Bharat)

Telangana New Governor Jishnu Dev Varma : కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఏడుగురిని కొత్తగా నియమించగా, మరో ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరోరాష్ట్రానికి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ (66)ను నియమించింది.

1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్‌ వర్మ త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 సేవలందించారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ కొనసాగారు. జిష్ణుదేవ్‌ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు.

ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తూన్న సీపీ రాధాకృష్ణన్‌ను ఇప్పటివరకూ తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్​గా ఉన్న రమేష్‌ బైస్‌ను తప్పించింది. ఇక రాజస్థాన్‌ గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్‌ హరిభావ్‌ కిషన్‌రావ్‌ బాగ్డేని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రాను తప్పించింది.

మమతా బెనర్జీపై గవర్నర్ బోస్​ పరువు నష్టం కేసు- అలా అన్నందుకే!

రాజస్థాన్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు ఓం ప్రకాశ్‌ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా భాధ్యతలు స్వీకరించనున్నారు. సిక్కిం గవర్నర్‌గా ఉన్న లక్షణ్‌ ప్రసాద్‌ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా బదిలీ చేసింది. లక్షణ్‌ ప్రసాద్​కు మణిపుర్‌ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మణిపుర్‌ గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది.

యూపీకి చెందిన కేంద్ర మాజీమంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ను ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియమించారు. అస్సాం మాజీ ఎంపీ రమెన్‌ డేకాను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పదవీ ఇప్పటికే పూర్తయింది. ఇక కర్ణాటక మాజీ మంత్రి సీహెచ్‌.విజయశంకర్‌ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న ఫగు చౌహాన్‌ను కేంద్రం తప్పించింది.

అస్సాం గవర్నర్‌ గులాబ్‌చంద్‌ కటారియాను పంజాబ్‌ గవర్నర్‌తో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి కె.కైలాసనాథన్‌ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.