ETV Bharat / state

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం - డబ్బులు తీసుకున్నాక పత్తా లేని లైఫ్​ లైన్ - Scams in the name of jobs

Travel Agency Cheated Youth in the Name of Jobs in Vizianagaram: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు కేటుగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. తాజాగా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పన ట్రావెల్ ఏజెన్సీ చేతిలో ఒడిశాకి చెందిన 123 మంది యువకులు మోసపోయారు.

youth_cheated
youth_cheated
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 9:24 PM IST

Travel Agency Cheated Youth in the Name of Jobs in Vizianagaram: మీ నమ్మకం, మీ బలహీనతే నేరస్తుల పెట్టుబడి. రూటు మార్చి బాధితులను ఏమార్చి అందినకాడికి దోచుకోవటమే కేటుగాళ్ల పని. వివిధ రకాల ఉద్యోగాలు పేరుతో దోచుకోవటమే వాళ్ల అంతిమ లక్ష్యం. పార్ట్ టైం ఉద్యోగాలు, ఇంట్లోనే ఉండి లక్షల రూపాయలు సంపాదించవచ్చంటూ ప్రకటనలు, వేరే దేశం పంపిస్తామంటూ నగదు కాజేస్తున్నారు. ఇలా ఒడిశాకు చెందిన కొంతమంది యువకులు విజయనగరంలోని ఓ ట్రావెల్ ఏజెన్సీ చేతిలో మోసపోయారు.

హోంగార్డు ఉద్యోగాల పేరుతో మోసాలు - కొనసాగుతున్న అరెస్టులు

ఉద్యోగం వచ్చిందని సంతోషపడ్డారు. అది ఇక్కడ కాదు, వేరే దేశంలో. ఇంకేముంది. డబ్బులు కట్టేశాం. ఫ్లైట్​ ఎక్కి అక్కడ దిగడమే. ఉద్యోగం చేసుకుంటే లైఫ్​ సెటిల్​ అయిపోయినట్లే. తెల్లారేసరికే అబుదాబిలో దిగుతాం అని ఆ యువకులు ఎన్నో కలలు కన్నారు. తీరా ఒడిశా నుంచి విజయనగరం చేరుకున్నాక ఆ యువకులకు షాక్​ తగిలింది. తమకు ఆ సంస్థ ఇచ్చిన అడ్రస్​లో ట్రావెల్​ ఏజెన్సీ కనిపించ లేదు. దీంతో తామంతా మోసపోయినట్లు యువకులు లబోదిబోమంటున్నారు.

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన ట్రావెల్ ఏజెన్సీ చేతిలో మోసపోయమంటూ ఒడిశాకి చెందిన యువకులు వాపోయారు. అబుదాబిలో ఉద్యోగం ఇప్పిస్తామని విజయనగరానికి చెందిన లైఫ్​లైన్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. ఒడిశాలోని పలు ప్రాంతాలకు చెందిన 123 మంది యువకుల నుంచి రూ.55 - 60 వేలు వసూలు చేసింది. కరపత్రాల్లో ఉద్యోగ ప్రకటన చూసి ఆన్​లైన్​లో నగదు చెల్లించామని ఒడిశా యువకులు ఆవేదన వ్యక్తం చేసారు.

మీ ఫోన్​కు రోజులో 12 ఫేక్​ మెసేజ్​లు! టచ్ చేస్తే ఖతమే! అవేంటో తెలుసా?

ఈ నెల 5న అబుదాబికి పంపుతామని యువకుల పేరుతో లైఫ్ లైన్ సంస్థ విమాన టికెట్స్ బుక్ చేసిందని తీరా తాము ఒడిశా నుంచి విజయనగరం వచ్చి చూశాక మోసపోయామని తెలిపారు. విజయనగరంలోని లైఫ్ లైన్ సంస్థ కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడ తాళాలు వేసి ఉండటంతో ఆ సంస్థ బోర్డు తిప్పేసిందని తెలుసుకున్నారు. ఈ విషయమై జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దీపికాను కలసి గోడు వెళ్లబోసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసారు.

ఆన్​లైన్ డేటింగ్ చేస్తున్నారా? రొమాన్స్ స్కామ్​లో చిక్కుకునే ప్రమాదం ఉంది - జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.