ETV Bharat / state

వాహనదారులకు గుడ్​ న్యూస్ - ఏపీలో రవాణాశాఖ సేవలన్నీ ఒకే వెబ్‌సైట్‌లో - Vahan Website in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 3:25 PM IST

AP Govt on Vahan Website : ఏపీలో రవాణాశాఖ సేవలన్నీ త్వరలో ఒకే వెబ్​సైట్ కిందకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ వెబ్‌సైట్‌ను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు, అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఇందులోని నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి సరిచేస్తున్నారు. ఈ విధానం విజయవంతమైతే రవాణాశాఖ అమలు చేస్తున్న ఈ-ప్రగతి సైట్‌ను పూర్తిస్థాయిలో నిలిపేసి, రాష్ట్రవ్యాప్తంగా వాహన్‌ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే వాహనదారులకు సేవలందించనున్నారు.

Vahan Website in AP
Vahan Website in AP (ETV Bharat)

Vahan Website in AP : ఐదేళ్ల క్రితం వరకు వాహనదారులకు లైసెన్సుల జారీ సహా వాహనాల రిజిస్ట్రేషన్, మార్పుల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలూ వేర్వేరు వెబ్ సైట్లను రూపొందించి అమలు చేసేవి. రాష్ట్రానికి చెందిన వాహనాలు, వాహనదారుల డేటాను ఈ-ప్రగతి వెబ్‌సైట్‌లో రవాణాశాఖ అధికారులు నమోదు చేసేవారు. దేశవ్యాప్తంగా ఒకే వెబ్‌సైట్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాహనాల డేటాను అక్కడి అధికారులు తీసుకోవడం, తనిఖీ చేయడం కష్టతరమయ్యేది.

ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాలు, ఆర్సీలు తదితర పత్రాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే అవకాశం లేకపోవడంతో, వాహనదారులపై అక్కడి అధికారులు వేధింపులకు పాల్పడేవారు. ఎడాపెడా జరిమానా విధించేవారు. ఈ సమస్యలపై వాహనదారుల ఆందోళనతో కేంద్రం, వాహనదారులందరికీ ఒకే వెబ్​సైట్ రూపొందించి ఐదేళ్ల క్రితమే అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఏకరూప లైసెన్సులు, ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించింది. పరివాహన్‌ డాట్‌ జీఓవీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో అన్ని రాష్ట్రాలూ చేరాలని, ఈ వెబ్‌సైట్‌లోనే డేటా నిక్షిప్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

AP Govt on Vahan Website : ఏపీలోనూ 2020 నుంచి వాహన్ వెబ్​సైట్ ద్వారానే రవాణా సేవలందించడం మొదలు పెట్టారు. ఈ-ప్రగతితో పోల్చితే వాహన్ వెబ్‌సైట్‌లో డేటా సురక్షితంగా ఉన్నా, నమోదు క్లిష్టతరంగా ఉంది. దీనిపై వాహనదారులు, సిబ్బందికి అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా, గత వైఎస్సార్సీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఈ-ప్రగతి వెబ్​సైట్‌నూ వినియోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాహనాలు, లైసెన్సుల జారీని రెండు వెబ్​సైట్లలోనూ నమోదు చేయడం, డేటా బదిలీ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది.

రెండు వెబ్​సైట్లలో డేటా నిర్వహణ క్లిష్టంగా మారి గందరగోళంగా మారింది. పైగా ఈ-ప్రగతి వెబ్​సైట్‌కు సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న ఓటీఎస్ఐ అనే సంస్థకు ఏకంగా రూ.18 కోట్ల బకాయి పెట్టిన వైఎస్సార్సీపీ సర్కార్, బకాయిల కోసం చెప్పులరిగేలా తిరిగినా చిల్లి గవ్వ ఇవ్వలేదు. దీంతో సదరు సంస్థ గత మే నెలలో అర్ధాంతరంగా సేవలు నిలిపివేసింది. దీంతో ఈ-ప్రగతి వెబ్​సైట్ ఆగిపోయి రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బకాయిలు ఇచ్చేందుకు నిధుల్లేని పరిస్ధితుల్లో ఉన్నతాధికారులు, సదరు సంస్థ ప్రతినిధులను వేడుకుని మరీ సేవలను పునరుద్ధరించాల్సి వచ్చింది.

AP Govt Focus on Transport Department : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రవాణాశాఖలో నెలకొన్న సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది. డేటాను రెండు వెబ్​సైట్లలో నిర్వహించడం వల్ల వస్తున్న ఇబ్బందులను అధికారులు సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అమలు చేస్తున్న వాహన్ వెబ్​సైట్ సమర్థంగా ఉన్నా, అమలు చేసేందుకు సరైన సాంకేతిక నిపుణులు, సిబ్బంది నియమించకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దీనివల్లే రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఈ-ప్రగతి వెబ్​సైట్‌ను అమలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

రెండింటినీ అమలు చేయడం సరికాదని నిర్ణయానికి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఏదో ఒక వెబ్​సైట్‌ను మాత్రమే అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. కేంద్రం తెచ్చిన వాహన్ వెబ్​సైట్ అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆదేశాలతో, ఆ వెబ్​సైట్ ద్వారా వస్తున్న సమస్య పరిష్కారంపై తొలుత రవాణాశాఖ అధికారులు దృష్టిపెట్టారు. సాంకేతిక నిపుణులను రప్పించి సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు.

పైలట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ-ప్రగతి వెబ్​సైట్‌ను నిలిపేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా కేవలం ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే ఈ-ప్రగతి వెబ్​సైట్‌ను నిలిపేశారు. ఈ జిల్లాలో వాహనదారుల సేవలన్నింటినీ కేంద్రప్రభుత్వం తెచ్చిన వాహన్ వెబ్​సైట్‌లోనే నమోదు చేస్తున్నారు. 15 రోజులపాటు ప్రతి అంశాన్నీ పరిశీలించి అన్ని సమస్యలకూ పరిష్కారాలను కనుగొననున్నారు. అనంతరం దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ వాహన్ వెబ్​సైట్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

ప్రభుత్వ వాహనాలను ఈజీగా గుర్తించేలా.. కొత్త సిరీస్ నంబర్ తెలుసా..!

Registration: 3 నెలల్లో.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.