Traffic Problems in Vijayawada : విజయవాడలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్థంగా తయారైంది. నిత్యం ఏదో చోట ప్రమాదం జరుగుతున్నా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పట్టడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో నగరానికి రాకపోకలు సాగించాలంటే ప్రజలు నరకం చూస్తున్నారు. వేలాది వాహనాలు రాకపోకలు సాగించే సింగ్ నగర్ ఫ్లైఓవర్‌కు పక్కన డబుల్ బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా నేతలు పట్టించుకోవడం లేదు. నిత్యమూ నగరానికి వివిధ ప్రాంతాలకు విద్య, ఉపాధి రీత్యా వచ్చే కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
వైసీపీ నేతల ర్యాలీ - ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలకు చుక్కలు
Not Dividing Road Motorists Faced Problems: విజయవాడ నగర జనాభా పెరిగింది. ప్రజల అవసరాలు తీర్చే విధంగా రోడ్ల విస్తరణ పనులు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్ధాల క్రితం నిర్మించిన రోడ్లే నేటికీ ప్రజలకు దిక్కు అవుతుంది. రోడ్ల విస్తరణ పనులపై పాలకులు దృష్టి సారించడం లేదు. ఉదయం ఎనిమిది గంటల నుంచి 11గంటల వరకు నగరంలో విపరీతమైన ట్రాఫిక్ కష్టాలు ఉంటున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి నగరం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు అధికంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటోంది.
ఉదయం, సాయంత్ర సమయాల్లో అత్యవసర పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా, నగరానికి రావాలన్నా ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్నాం. ఆటోనగర్ గేటు, బెంజ్ సర్కిల్, సింగ్ నగర్ ఫ్లై ఓవర్ లపై ట్రాఫిక్ ఎక్కువగా ఆగిపోతోంది. ట్రాఫిక్‌లో నరకం చూస్తున్నాం -వాహనదారులు
రోడ్డుపై గుంతలో ఇరుక్కుపోయిన లారీ - భారీగా ట్రాఫిక్ జామ్
సింగ్ నగర్ ఫ్లైఓవర్‌పై ఉదయం, సాయంత్రం సమయంలో గంటల తరబడి భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ మార్గంలో రోజూ నరకం చూస్తున్నాం. డబుల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. -వాహనదారులు
Traffic Signals Not Working Properly: సింగ్ నగర్ ఫ్లైఓవర్‌పై ఉదయం, సాయంత్రం సమయంలో గంటల తరబడి భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఈ మార్గంలో రోజూ రాకపోకలు సాగించే వాహనదారులు నరకం చూస్తున్నారు. డబుల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గుణదల, వాంబే కాలనీ, మధురానగర్ వంటి ప్రాంతాల ప్రజలకు రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పని చేయడం లేదని అవసరమైన ప్రాంతాల్లో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని స్థానికులు మండిపడ్డారు.
నెలలు తరబడి కల్వర్టు నిర్మాణ పనులు - వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు