ETV Bharat / state

రోజుకో తరహాలో పంథా మార్చుతున్న సైబర్ నేరగాళ్లు - అప్రమత్తంగా ఉండడమే శ్రీరామ రక్ష! - TRADING FRAUDS IN TELANGANA

Trading Scam in Telangana : సైబర్ నేరగాళ్ల పంథా ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక్కోసారి ఒక్కోలా మారుతుంటుంది. ఫెడెక్స్ స్కామ్‌, ట్రేడింగ్ స్కామ్, ఆన్‌లైన్ యాప్ మోసాలు ఇలా మారుతూనే ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఫెడెక్స్‌ నేరాలతో రెచ్చిపోయిన సైబరాసురులు ఇటీవల ట్రేడింగ్ స్కామ్‌లతో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సీసీఎస్‌లో నమోదయ్యే వాటిలో ఇటీవల ట్రేడింగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని అరికట్టాలంటే అవగాహనతో పాటు అప్రమత్తత తప్పనిసరిని నిపుణులు చెబుతున్నారు.

Cyber Criminals Latest Fraud
Trading Scam in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 8:08 AM IST

రోజుకో తరహాలో పంథా మార్చుతున్న సైబర్ నేరగాళ్లు (ETV Bharat)

Trading Scam in Telangana : హైదరాబాద్‌లో ట్రేడింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి. అధిక లాభాల కోసం ఆశపడితే అమాయకుల డబ్బు సైబర్ నేరగాళ్లకు చెంతకు చేరుతోంది. ఇటీవలే నగరంలో వెలుగుచూస్తున్న ఘటనల్లో అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండువారాల క్రితం నగరానికి చెందిన ఓ గృహిణి ఫేస్‌బుక్‌లో ట్రేడింగ్, స్టాక్‌ మార్కెట్‌ పేరిట ఓ ప్రకటన చూసింది. అధికంగా డబ్బులు వస్తాయని నమ్మించి ఆ మహిళను ఏ7 అవినాష్స్‌ యునైటెడ్‌ బుల్స్‌ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్ చేశారు. తర్వాత పెట్టుబడులు పెడితే 5 నుంచి 20 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. ముందుపెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు చూపారు. వాటిని నమ్మి పెట్టుబడులు పెట్టిన ఆ మహిళకు రూ.27 లక్షల పైచిలుకు ఆదాయాన్ని వర్చువల్‌గా చూపించారు. కానీ వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేయడంతో మోసపోయానని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Cyber Criminals Fraud High Interest Rates on Stocks : ఇటీవల మరో వ్యక్తికి ఇదే అనుభవం ఎదురైంది. పెట్టుబడులు, ట్రేడింగ్ పేరిట నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి లక్షల్లో డబ్బు కోల్పోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాటా ఇన్వెస్టిమెంట్ ఫండ్‌ పేరిట మరో 20 ఏళ్ల యువకుడు మోసపోయాడు. ముందు కొంత పెట్టుబడి పెట్టించి, రెట్టింపు డబ్బులు ఖాతాల్లో జమ చేసి నమ్మించారు. అలా డబ్బుల ఆశతో భారీగా పెట్టుబడులు పెట్టాడు. తర్వాత ఆ యువకుడి నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించగా రూ.9 లక్షలు పంపిస్తేనే వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోగలరని చెప్పడంతో బాధితుడు పోలీసుల ఎదుట తన గోడు వెల్లబోశాడు. గూగుల్ మ్యాప్స్‌కి రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి మరో 30 ఏళ్ల మహిళకు సైబర్‌ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు.

టీజీసీఎస్‌బీ మరో ఘనత - సైబర్‌ నేరాల బాధితులకు ఒక్కరోజే రూ.7.9 కోట్ల అప్పగింత

"వాట్సాప్​ గ్రూప్​లో వచ్చే స్టాక్​ మార్కెట్​ ప్రకటనలు నమ్మవద్దు. సెబీ రిజిస్టర్​ అయిన వాటిలోనే పెట్టుబడులు పెట్టుకోవాలి. మోసం చేస్తే కేసులు పెట్టి సదురు కంపెనీ నుంచి డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. సోషల్​ మీడియా ద్వారా పెట్టుబడులు పెడితే నగదుపై గ్యారంటీ ఉండదు. అధిక వడ్డీ అని ఆశ చూపితే చాలా జాగ్రత్తగా ఉండాలి." - రూపేశ్, సైబర్ నిపుణుడు

Cyber Fraud in Telangana : ట్రేడింగ్, ఫెడెక్స్ స్కామ్ ఏదైనా సరే అప్రమత్తంగా ఉంటే ఎవరు ఏం చేయలేరని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు. బాధితుడి అత్యాశే నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. నేరగాళ్లు అధిక లాభాలు ఆశ చూపినా, ఫెడెక్స్‌ పార్సిల్స్‌ పేరిట భయపెట్టినా ఆందోళనకు గురికాకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ డబ్బులు మీ ఖాతా నుంచి మాయమైతే నగదు బదిలీ జరిగిన మొదటి గంటలోపు 1930 లేదా www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని అధికారులు కోరుతున్నారు.

మీ సెల్​ఫోన్ పోయిందా ఐతే గోవిందా - క్షణాల్లో మీ ఖాతాల్లో డబ్బు మాయం - MOBILE THEFT CASES IN HYDERABAD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.