Tractor Hit Bolero Two Died In Konaseema District : కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మండపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని మండపేట నుంచి ఆలమూరు వైపు బియ్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆలమూరు వాసులు లంకె సూరిబాబు, వనమాడి సాయిబాబుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గాయాలయిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Road Accident in Alluri Ditrict Father & Son Dead : అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెం ఘాట్ మలుపులో బైకు అదుపుతప్పి బండరాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. భార్యకు చెయ్యి విరిగిపోగా, కుమార్తెకు గాయాలయ్యాయి. వారిని రాజేంద్రపాలెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నర్సీపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతులు అడ్డతీగలకు చెందిన యనమదల రాంబాబు, ప్రశాంత్‌గా గుర్తించారు. బంధువులు ఇంటికి బాలారం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
Road Accidents in Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణణీయంగా పెరుగుతుంది. అయినప్పటికీ అధికారులు ఎటువంటి అదనపు చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. మనం సక్రమంగా వాహనం నడుపుతున్నా మృత్యువు ఏ వైపు నుంచి పొంచి వస్తుందోనని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అన్నీ సవ్యంగా ఉన్న ఏపీలో గుంతల రోడ్లు ప్రాణాలు బలితీసుకోవడానికి సిద్దంగా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జనాలు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటే ఏమైనా చర్యలు చేపడుతున్నారా అని ప్రజలు నిలదీస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని నిరాశ చెందుతున్నారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు - రక్తమోడిన రహదారులు - Ten people died in road accidents
నెత్తురోడిన రహదారులు- 11మంది దుర్మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి - Road Accidents in AP