ETV Bharat / state

పెళ్లి పేరుతో మోసం, ఆపై బెదిరింపులు - మహిళా నిర్మాతపై కేసు నమోదు

Tollywood Lady Producer Cheating For Money : గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచిపెట్టి ఓ మహిళ ప్రేమ పేరుతో యువకుడిని పెళ్లి చేసుకుంది. అతని వద్ద నుంచి అందినకాడికి దండుకుంది. తీరా ఆమె గురించి విస్తుపోయే నిజాలు బయటపడడంతో తాను మోసపోయాయని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

Film Producer Asha Mallika Cheating Case
Tollywood Lady Producer Cheating For Money
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 2:02 PM IST

Tollywood Lady Producer Cheating For Money : ఈ మధ్య కాలంలో డబ్బు కోసం మోసాలు పెరిగిపోతున్నాయి. మహిళలు సైతం మోసపూరిత చర్యలకు పాల్పడి పురుషులను డబ్బు కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటీవల ఓ మహిళ హైవేపై లిప్ట్ అడిగి మార్గమధ్యలో దిగి, డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానంటూ బెదిరించిన ఘటన చూశాం. తాజాగా డబ్బుల కోసం పెళ్లి పేరుతో మోసం(Cheating) చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న ఓ మహిళపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

Shilpa Chowdary Cheating Case: చంచల్‌గూడ జైలు నుంచి శిల్పా చౌదరి విడుదల

Tollywood Cheating Case : జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్​లోని వెంకటగిరిలో నివాసముంటున్న నాగార్జున బాబు సినీ పరిశ్రమలో(Film industry) కెమెరా అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. అతడికి 'బైరవపురం' సినిమా షూటింగ్ సమయంలో చిత్ర నిర్మాతగా వ్యవహరించిన గుడివాడ ఆశా మల్లికతో పరిచయం ఏర్పడింది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తన ఇంటికి డిన్నర్​కు రావాలని ఆమె కోరడంతో నాగార్జున బాబు వెళ్లాడు. డిన్నర్ తర్వాత వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత తాను గర్భం దాల్చానని, తనకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని, తన భర్తతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె నమ్మబలికింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా చిలుకూరి బాలాజీ ఆలయం వద్ద పెళ్లి చేసుకున్నాడు.

చీటింగ్​ కేసుపై స్పందించిన నటి శిల్పాశెట్టి

Film Producer Asha Mallika Cheating Case : కొన్నాళ్ల తర్వాత తనకు అర్జెంట్​గా డబ్బులు కావాలని ఆమె కోరడంతో రూ.18.5 లక్షల నగదు ఇచ్చి, మరో రూ.10 లక్షలు ఆశా మల్లిక అకౌంట్​కు పంపించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ గొడవలు జరిగాయి. ఇటీవల ఆమె గురించి వాకబు చేయగా, గతంలోనే రెండు పెళ్లిళ్లు కావడంతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని నిలదీయడంతో అతడిపై కూకట్​పల్లి పోలీస్ స్టేషన్​లో గృహ హింస కేసు పెట్టింది.

ఆశా మల్లికపై నాగార్జున బాబు కేసు నమోదు : కాగా, ఆమె పెట్టిన కేసును రాజీ చేసుకోవాలంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని బెదిరిస్తోందని నాగార్జున బాబు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు ఆశా మల్లిక ఇంతకు ముందు సైతం కొంత మందిని ఈ విధంగా ముగ్గులోకి దింపి మోసం చేయడంతో పాటు వారిపై కేసులు పెట్టినట్లు పోలీసులకు వివరించాడు. దీంతో ఆమెపై 389, 420, 419, 494 సెక్షన్​ల కింద కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

'సార్పట్ట' హీరో ఆర్యపై చీటింగ్ కేసు!

Love Fraud: ప్రేమ పేరుతో నగ్న చిత్రాలు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.